E-Paper
Advertisement

రైట్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. క్వాలిఫికేషన్ ఇదే, లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

రైట్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. క్వాలిఫికేషన్ ఇదే, లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
Advertisement

నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ రంగ సంస్థ రైట్స్ లిమిటెడ్ (RITES Ltd) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వివిధ ప్రాజెక్టుల్లో కాంట్రాక్ట్ విధానంలో పనిచేసేందుకు అర్హులైన ఇంజినీరింగ్ నిపుణుల నుంచి దరఖాస్తులను కోరుతోంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5 రెసిడెంట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న సంస్థ ప్రాజెక్ట్ సైట్‌లలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

Advertisement

పోస్టుల సంఖ్య: 5

విద్యార్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్, సివిల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో ఫుల్ టైమ్ డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

Advertisement

ఎక్స్ పీరియన్స్: విద్యార్హతతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం కలిగి ఉండటం తప్పనిసరి. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులను పర్యవేక్షించే సామర్థ్యం ఉన్నవారికి ప్రాధాన్యం లభిస్తుంది.

వయస్సు: అభ్యర్థుల వయసు 2026 ఏప్రిల్ 27 నాటికి 40 ఏళ్లకు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అలాగే దివ్యాంగులకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

జీతం: ఎంపికైన వారికి నెలకు రూ.32,492 వేతనంగా చెల్లిస్తారు. ఇది ఒప్పంద కాలపరిమితిని బట్టి మారుతుంటుంది.

సెలెక్షన్ ప్రాసెస్:  దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆబ్జెక్టివ్ తరహాలో రాత పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 125 మార్కులకు జరిగే ఈ పరీక్షలో ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ ఉండదు. ప్రతిభ ఆధారంగానే తుది ఎంపిక జరుగుతుంది. రాత పరీక్షను కోల్‌కతా, గుర్గావ్ కేంద్రాలలో నిర్వహిస్తారు. అభ్యర్థులు తమకు అనుకూలమైన కేంద్రాన్ని ఎంచుకోవచ్చు.

దరఖాస్తు విధానం: అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు రైట్స్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.300 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

చివరి తేది: ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించడానికి 2026 ఏప్రిల్ 27 చివరి తేదీగా నిర్ణయించారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు సంస్థ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు

అఫీషియల్ వెబ్ సైట్: www.rites.com

ALSO READ: సౌత్ సెంట్రల్ రైల్వేలో 2801 ఉద్యోగాలు.. సెలెక్ట్ అయితే మంచి భవిష్యత్తు, పూర్తి వివరాలివే

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×