E-Paper
Advertisement

SBI Careers: నిరుద్యోగులకు పండగలాంటి వార్త.. ఎస్బీఐలో 2,273 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.85,590

SBI Careers: నిరుద్యోగులకు పండగలాంటి వార్త.. ఎస్బీఐలో 2,273 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.85,590
Advertisement

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), నిరుద్యోగులకు భారీ నోటిఫికేషన్‌తో తీపి కబురు అందించింది. దేశవ్యాప్తంగా వివిధ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీకి రెగ్యులర్ ప్రాతిపదికన దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రతిష్టాత్మకమైన బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం.

సర్కిళ్ల వారీగా ఖాళీలు..

Advertisement

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16 సర్కిళ్లలో నియామకాలు చేపట్టనున్నారు. వీటిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్‌లో 80 పోస్టులు, అమరావతి సర్కిల్‌లో 101 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఇతర ప్రధాన సర్కిళ్లలో గాంధీనగర్ (249), కోల్‌కతా (242), బెంగళూరు (236), లఖ్‌నవూ (221), చెన్నై (208) వంటి నగరాల్లో అత్యధిక ఖాళీలు ఉన్నాయి. స్థానిక అవసరాలకు అనుగుణంగా ఆయా రాష్ట్రాల అభ్యర్థులకు ప్రాధాన్యత లభించనుంది.

తెలుగు రాష్ట్రాల్లో వెకెన్సీలు ఉన్నాయి.

Advertisement

హైదరాబాద్: 80 పోస్టులు

అమరావతి: 101 పోస్టులు

విద్యార్హతలు, వయస్సు వివరాలు.. 

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్హతతో పాటు, అభ్యర్థులు ఏ సర్కిల్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారో, ఆ ప్రాంతపు స్థానిక భాషలో చదవడం, రాయడం మాట్లాడటంలో ప్రావీణ్యం కలిగి ఉండటం తప్పనిసరి. అలాగే సంబంధిత పని అనుభవం (Work Experience) కూడా కలిగి ఉండాలి.

వయోపరిమితి విషయానికి వస్తే, 2025 డిసెంబర్ 31 నాటికి అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు మరియు పీడబ్ల్యూబీడీ (PwBD) అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు మినహాయింపు ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం, జీతం.. 

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది. మొదట ఆన్‌లైన్ రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి స్క్రీనింగ్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. చివరగా స్థానిక భాషా పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 48,480 నుంచి రూ. 85,590 వరకు ఆకర్షణీయమైన వేతనం లభిస్తుంది.

దరఖాస్తు వివరాలు:

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ. 750 కాగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎటువంటి ఫీజు లేదు. దరఖాస్తు ప్రక్రియ జనవరి 29, 2026న ప్రారంభమై, ఫిబ్రవరి 18, 2026న ముగుస్తుంది. అర్హులైన అభ్యర్థులు గడువులోగా అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవలసిందిగా బ్యాంక్ వర్గాలు సూచించాయి.

అఫీషియల్ వెబ్ సైట్: https://sbi.bank.in/

ALSO READ: Smartphone Comparison: రెడ్మీ నోట్ 15 ప్రో vs వివో Y400 ప్రో vs మోటోరోలా ఎడ్జ్ 60.. రూ.30,000 ధరలో ఏది బెస్ట్?

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×