E-Paper
Advertisement

Court Jobs: రూ.78,000 జీతం.. గౌరవప్రదమైన హోదా, కోర్టుల్లో ఉద్యోగాలు

Court Jobs: రూ.78,000 జీతం.. గౌరవప్రదమైన హోదా, కోర్టుల్లో ఉద్యోగాలు

దేశ రాజధాని దిల్లీలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను రెగ్యులర్‌ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 22 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో అసిస్టెంట్ ఎడిటర్ పోస్టులు 5 ఉన్నాయి. అసిస్టెంట్ డైరెక్టర్ విభాగంలో 1 ఖాళీలు ఉన్నాయి. సీనియర్ కోర్టు అసిస్టెంట్ కేటగిరీలో 02 ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. అత్యధికంగా అసిస్టెంట్ లైబ్రేరియన్ విభాగంలో 14 పోస్టులను భర్తీ చేయనున్నారు.

విద్యార్హత:

అభ్యర్థుల అర్హతల విషయానికి వస్తే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసి ఉండాలి. ముఖ్యంగా లా (Law), మ్యూజియాలజీ, లైబ్రరీ సైన్స్‌ వంటి సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తుకు అర్హులు అవుతారు.

వయస్సు:

విద్యార్హతతో పాటు ఆయా రంగాల్లో పని అనుభవం తప్పనిసరిగా ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. వయోపరిమితి 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి.

జీతం..

ఎంపికైన అభ్యర్థులకు వేతనాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. అసిస్టెంట్ ఎడిటర్‌కు నెలకు రూ. 78,800 జీతం అందుతుంది. అసిస్టెంట్ డైరెక్టర్‌కు రూ. 67,700 వేతనం ఇస్తారు. సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ అలాగే అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 47,600 చొప్పున వేతనం చెల్లిస్తారు.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ..

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది. మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో ప్రతిభ కనబరిచిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.

దరఖాస్తు విధానం..

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తు ప్రక్రియ 2026 ఫిబ్రవరి 23వ తేదీన ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 8వ తేదీని చివరి గడువుగా నిర్ణయించారు.

ఫీజు వివరాలు..

ఫీజు వివరాలు పరిశీలిస్తే జనరల్ అలాగే ఓబీసీ అభ్యర్థులు రూ. 1,500 చెల్లించాలి. ఎస్సీ అలాగే ఎస్టీ అభ్యర్థులకు రూ. 750 ఫీజుగా నిర్ణయించారు. అర్హత గల అభ్యర్థులు గడువు ముగిసేలోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.sci.gov.in/

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×