Telangana TET Exam Syllabus: టెట్ ఎగ్జామ్, టీచర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు ఇది బిగ్ అలెర్ట్. అభ్యర్థులకు మరో అప్డేట్ వచ్చేసింది. కొత్త టెట్ నోటిఫికేషన్ కు సంబంధించిన సిలబస్ అందుబాటులోకి వచ్చింది. టెట్ ఎగ్జామ్ కోసం ప్రిపరయ్యే అభ్యర్థులు అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్- 2025) నోటిఫికేషన్ ను విద్యా శాఖ ఏప్రిల్ 11 న జారీ చేసిన విషయం తెలిసిందే. గతంలో ప్రతి ఏడాది రెండు సార్లు టెట్ ఎగ్జామ్ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే మొదటి విడతకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఇప్పటికే విడుదల చేయగా.. ఏప్రిల్ 15 నుంచి ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించనుంది.
ఈ క్రమంలోనే అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. టెట్ తొలి విడత నోటిఫికేషన్ కు సంబంధించిన సిలబస్ ను విద్యాశాఖ అఫీషియల్ వెబ్ సైట్ లో అందుబాటులోకి తెచ్చింది.
ఇప్పటికే గత రెండు రోజుల నుంచి అభ్యర్థులు టెట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు గడువు ముగియనుంది. టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ ను కూడా విద్యాశాఖ వెబ్ సైట్ లో పేర్కొంది. జూన్ 15 నుంచి జూన్ 30 వరకు టెట్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. జూన్ 9 న ఎగ్జామ్ కు ఆరు రోజుల ముందు నుంచి హాల్ టిక్కెట్లు విడుదల కానున్నాయి. జూలై 22న టెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ ప్రకటిస్తారు.
టెట్ సిలబస్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే..?
❂ టెట్ అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లండి.. అఫీషియల్ వెబ్ సైట్: https://schooledu.telangana.gov.in/SCHOOLEDUCATION/
❂ హోం పేజీలో Click Here for TG TET June-2025 అని కనిపిస్తోంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
❂ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత హోంపేజీలో సెలబస్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
❂ అక్కడ 15 పేపర్లు కనిపిస్తాయి. ఆ పక్కనే సిలబస్ పక్కన డౌన్ లోడ్ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసతే సిలబస్ కాపీ డౌన్ లోడ్ అవుతోంది.
❂ ఆప్షన్ పై క్లిక్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు.
టెట్ ఎగ్జామ్ విధానం:
టెట్ ఎగ్జామ్ లో రెండు పేపర్లు ఉండనున్న విషయం తెలిసిందే. పేపర్ -1 సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియామకానికి, పేపర్ -2 స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కోసం అర్హత సాధించేందుకు నిర్వహించనున్నారు. ఒక్కో పేపర్ 150 మార్కులకు నిర్వహిస్తారు. 150 నిమిషాల సమయం ఉంటుంది.
❂ పేపర్-1 కు 1 నుంచి ఎనిమిదో తరగతులు, పేపర్ -2 కు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న ప్రశ్నలు అడుగుతారు. అన్ని పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి.
❂ పేపర్ -2 లో మళ్లీ మ్యాథ్స్, సైన్స్, సోషల్ రెండు వేరు వేరు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్ కు 150 నిమిషాల సమయం ఉంటుంది.
❂ ఒక్కసారి టెట్ లో అర్హత సాధిస్తే ఇక ఆ సర్టిఫికెట్ తో డీఎస్సీ రాయొచ్చు.
టెట్ లో మంచి మార్కులు వస్తే.. డీఎస్సీ ఎగ్జామ్ లో మార్కులు యాడ్ అవుతాయి. రెండింటిలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది జాబితాను రూపొందించి ఫలితాలను విడుదల చేయనున్నారు. డీఎస్‌సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.