Waqf Amendment Act : వక్ఫ్ చట్టం కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వక్ఫ్ ఆస్తుల్లో ఎటువంటి మార్పులు చేయవద్దన్న ఆదేశాలు జారీ చేసింది. బోర్డులో ఎలాంటి కొత్త నియామకాలు చేయద్దని కూడా సూచించింది. అయితే, వక్ఫ్ సవరణ చట్టంపై స్టే ఇచ్చేందుకు మాత్రం సుప్రీంకోర్టు నిరాకరించింది. యథాతథ స్థితిని కొనసాగించాలని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది.
72 పిటిషన్లపై విచారణ
వక్ఫ్ సవరణ చట్టం 2025 రాజ్యాంగబద్దతను సవాలు చేస్తూ సుప్రీంలో 72 పిటిషన్లు ఫైల్ అయ్యాయి. అన్నిటినీ కలిపి విచారణ చేపట్టింది కోర్టు. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై వివరంగా సమాధానం ఇవ్వాటానికి వారం రోజుల గడువు అడిగింది కేంద్రం. అందుకు అంగీకరిస్తూ.. కౌంటర్ ఫైల్ చేయడానికి కేంద్రప్రభుత్వానికి వారం గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు. అయితే, కొన్ని కండిషన్లు విధించింది.
Also Read : ఓ చిన్నారిపై పేపర్లో వార్త.. సీఎం రేవంత్‌రెడ్డి ఏం చేశారంటే..
తదుపరి విచారణ జరిగే వరకూ.. వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతర సభ్యులను నియమించ వద్దని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై కూడా చేయొద్దని స్పష్టం చేసింది. అనంతరం, విచారణను మే 5 కు వాయిదా వేసింది.
ఆ ఆస్తుల డీనోటిఫై వద్దు..
వక్ఫ్ పిటిషన్లపై విచారణ సందర్భంగా అంతకుముందు కూడా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వక్ఫ్ బోర్డుకు చెందుతాయని కోర్టులు ప్రకటించిన ఆస్తులను.. ప్రస్తుతానికి వక్ఫ్ జాబితా నుంచి తొలగించవద్దని కేంద్రానికి సూచించింది సుప్రీంకోర్టు. వక్ఫ్ బోర్డులు, వక్ఫ్ మండలి మినహా.. మిగతా సభ్యులంతా ముస్లింలే ఉండాలని కోర్టు అభిప్రాయపడింది. అయితే, ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఏ మతానికి చెందిన వారినైనా నియమించ వచ్చని క్లారిటీ ఇచ్చింది.