Backfoot No Ball: ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా బుధవారం రోజు ఢిల్లీ వేదికగా రాజస్థాన్ రాయల్స్ – ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అనంతరం 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఆఖరి బంతికి 188 పరుగులు చేయడంతో మ్యాచ్ టై గా ముగిసింది.
లక్ష్య చేదనలో రాజస్థాన్ విజయానికి ఆఖరి ఓవర్ లో 9 పరుగులు అవసరం అయ్యాయి. అయితే స్టార్క్ చక్కని బంతులు వేశాడు. ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదు. దీంతో చివరి ఓవర్ లో 8 పరుగులే వచ్చాయి. ఇక ఇరుజట్లు సేమ్ స్కోర్ చేయడంతో సూపర్ ఓవర్ అనివార్యంగా మారింది. ఈ సూపర్ ఓవర్ లో రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ చేసింది. రాజస్థాన్ బ్యాటర్లలో హిట్ మేయర్, రియాన్ పరాగ్ ఓపెనర్లుగా దిగారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ మిచెల్ స్టార్క్ అద్భుత బౌలింగ్ తో కేవలం 11 పరుగులకే వారిని కట్టడి చేశాడు.
జైష్వాల్, రియాన్ పరాగ్ ఇద్దరూ రనౌట్ కావడంతో ఐదు బంతులకే రాజస్థాన్ ఇన్నింగ్స్ ముగిసింది. ఈ మ్యాచ్ లో కేవలం ఒక వికెట్ తీసిన స్టార్క్ కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్లలోని ఆటగాళ్లు దాదాపు మూడు హాఫ్ సెంచరీల స్కోర్ నమోదు చేసినా.. స్టార్క్ నే ఈ అవార్డు వరించింది. ఇన్నింగ్స్ లోని 20 వ ఓవర్ తో పాటు సూపర్ ఓవర్ ను అద్భుతంగా బౌలింగ్ చేయడం, రెండు రనౌట్ లలో పాలు పంచుకోవడంతో మిచెల్ నే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపిక చేశారు.
ఇక 12 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 4 బంతుల్లోనే మ్యాచ్ ముగించింది. వాస్తవానికి ఈ మ్యాచ్ లో ఢిల్లీ గెలిచింది అని చెప్పే కంటే బదులు.. రాజస్థాన్ రాయల్స్ చేజేతులా ఈ మ్యాచ్ లో ఓడిందని చెప్పవచ్చు. ఫీల్డింగ్ లో పలు క్యాచ్లు వదిలేయడం, చివరి ఓవర్ లో సందీప్ శర్మ అనవసరమైన వైడ్లు, నో బాల్ వేయడం, సూపర్ ఓవర్ లో ఆల్ అవుట్ కావడం రాజస్థాన్ ఓటమికి కారణమయ్యాయి.
Also Read: Suniel KL Rahul: మామ, అల్లుళ్లు ఇద్దరు భారీ స్కెచ్.. 10 కోట్లు పెట్టి
అయితే ఈ మ్యాచ్ లో స్టార్క్ వేసిన బంతిని నోబెల్ గా ప్రకటించడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. ఈ మ్యాచ్ కి ముందు ముంబై జట్టు బౌలర్ విగ్నేష్ పుతూర్ వేసిన బంతికి నోబాల్ ఇవ్వలేదు ఫీల్డ్ అంపైర్. కానీ స్టార్క్ వేసిన బంతిని మాత్రం నో బాల్ గా ప్రకటించారు. దీంతో ముంబై జట్టు అంబానీ టీమ్ అయినందువల్లే నో బాల్ గా ప్రకటించలేదని ట్రోలింగ్ జరుగుతుంది. ఐపీఎల్ లో అంబానీకి ఓ న్యాయం.. మిగిలిన జట్లకు ఓ న్యాయమా..? అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజెన్లు.
Vignesh Puthur : No Ball Not Given 🔥
Mitchell Starc : No Ball Given 😅The OG Ambani Indians Are Back 💙 MI Easily Making Through Playoffs From Here 🔥 pic.twitter.com/9SZpJenJyC
— Junaid Khan (@JunaidKhanation) April 17, 2025