E-Paper
Advertisement

TS CPGET: తెలంగాణ సీపీ గెట్ నోటిఫికేషన్ విడుదల!

TS CPGET: తెలంగాణ సీపీ గెట్ నోటిఫికేషన్ విడుదల!
Advertisement

TS CPGET Notification: తెలంగాణ పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ను ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విడుదల చేశారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 18 నుంచి జూన్ 17 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. రూ. 500 ఆలస్య రుసుముతో జూన్ 25 వరకు, రూ. 2 వేల ఆలస్య రుసుముతో జూన్ 30 వరకు అప్లై చేసుకోవొచ్చని టీఎస్ సీపీ గెట్ కన్వీనర్ ప్రొ. పాండురంగారెడ్డి తెలిపారు. సీపీ గెట్ ప్రవేశ పరీక్షలను ప్రాథమికంగా జులై 5 నుంచి నిర్వహించే అవకాశమున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ పరీక్షను ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న విషయం విధితమే.

కాగా, సీపీ గెట్ పరీక్ష ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఓయూ, కేయూ, శాతవాహన, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, జేఎన్ టీయూహెచ్ యూనివర్సిటీల్లో పీజీ మరియు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.

Advertisement

 

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×