Big Stories

PBKS Won Against RR: పంజాబ్ కింగ్స్ గెలుపు.. రాజస్థాన్‌కు వరుసగా నాలుగో ఓటమి!

IPL 2024 65th Match – Punjab Kings Won by 5 Wickets against Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్ కి ఏమైంది? అందరి నోటా అదే మాట.. ఇంతవరకు దుమ్ముదుమారం రేపి, చాలాకాలం పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్న జట్టేనా ఇది? అని అడుగుతున్నారు. ఆల్రడీ ప్లే ఆఫ్ కి చేరుకుని మరీ, వరసపెట్టి ఇలా మ్యాచ్ లు ఓడిపోతున్న తీరుపై అందరూ ఆశ్చర్యపోతున్నారు.

- Advertisement -

పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలైన రాజస్థాన్ తన పరాజయ పరంపరను కొనసాగించింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ మాత్రం మొదట్లో ఆడాల్సిన మ్యాచ్ లన్నీ ఓడిపోయి, చివర్లో గెలిచి, కొంచెం పరువు నిలబెట్టుకుంది. పాయింట్ల పట్టికలో పదో స్థానం నుంచి 9వ స్థానంలోకి వచ్చింది.

- Advertisement -

ఇప్పుడందరిలో ఒకటే మాట.. కొంపదీసి ప్లే ఆఫ్ లో కూడా రాజస్థాన్ ఇలాగే ఆడుతుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే టాస్ గెలిచి బ్యాటింగు తీసుకున్న రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేసింది. మరోవైపు లక్ష్య ఛేదనలో పంజాబ్ పడుతూ లేస్తూ ఎట్టకేలకు కెప్టెన్ శామ్ కర్రన్ ఒంటరిపోరాటంతో 18.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసి విజయం సాధించింది.

Also Read: SRH vs GT IPL 2024: హైదరాబాద్ మ్యాచ్ కి వర్షం దెబ్బ..

ఇకపోతే రాజస్థాన్ రాయల్స్ ఓడినా 16 పాయింట్లతో ప్లే ఆఫ్ కి చేరుకుంది. పంజాబ్ గెలిచి…అట్టడుగు స్థానం నుంచి బయటపడి, పరువు దక్కించుకుంది. ఆ ఆఖరి స్థానాన్ని ముంబై కి ఇచ్చింది.

వివరాల్లోకి వెళితే .. 145 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేసిన పంజాబ్ కి స్టార్టింగ్ లోనే గట్టి దెబ్బలు తగిలాయి. ఓపెనర్లు ప్రభ్ సిమ్రాన్ సింగ్ (6), జానీ బెయిర్ స్టో (14), రిలీ రూసో (22), శశాంక్ సింగ్ డక్ అవుట్ ఇలా ఫటాఫట్ అయిపోయారు. 4.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 36 పరుగులతో ముక్కుతూ మూలుగుతూ మొదలైంది. ఇక 8 ఓవర్లు గడిచేసరికి 4 వికెట్ల నష్టానికి 48 పరుగులతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.

అందరూ పంజాబ్ పని అయిపోయిందని అనుకున్నారు. కానీ కెప్టెన్ శామ్ కర్రాన్ ఊరుకోలేదు. పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడాడు. ఒంటరి పోరాటం చేశాడు. 41 బంతుల్లో 3 సిక్స్ లు, 5 ఫోర్ల సాయంతో 63 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అయితే తనకి సపోర్ట్ గా జితేశ్ శర్మ (22), అశుతోష్ శర్మ (17 నాటౌట్) నిలిచారు. మొత్తానికి 18.5 ఓవర్లలో 145 పరుగులు చేసి పంజాబ్ విజయం సాధించింది. 18వ ఓవర్ లో ఆవేశ్ ఖాన్ బౌలింగులో సిక్స్ లు కొట్టిన శ్యామ్ కర్రాన్ మ్యాచ్ ని గెలిపించాడు.

Also Read: Virat Kohli: రిటైర్మెంట్ తర్వాత నేను మీకు కనిపించను.. విరాట్ కోహ్లీ సంచలన కామెంట్స్

రాజస్థాన్ బౌలింగులో ట్రెంట్ బౌల్ట్ 1, ఆవేశ్ ఖాన్ 2, చాహల్ 2 వికెట్లు పడగొట్టారు.

మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ కూడా తడబడుతూనే మొదలెట్టింది. ఎందుకో యశస్వి జైశ్వాల్ ఓపెనర్ గా ఆకట్టుకోవడం లేదు. ఇలా వెళ్లి అలా వచ్చేస్తున్నాడు. ఈ సారి కేవలం ఒక ఫోర్ కొట్టి అవుట్ అయి వచ్చేశాడు. మరో ఓపెనర్ టామ్ కొహ్లెర్ (18) పరిస్థితి అంతేలా మారింది. తర్వాత ఆదుకుంటాడనుకున్న కెప్టెన్ సంజూ శాంసన్ (18) ఈసారి త్వరగా అవుట్ అయిపోయాడు.

తర్వాత రియాన్ పరాగ్ ఒంటరి పోరాటం చేశాడు. 34 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 48 పరుగులు చేశాడు. ఎక్కడా రిస్క్ షాట్లు కొట్టలేదు. సిక్సర్లకి వెళ్లలేదు. చాలా కంట్రోల్ గా ఆడి, రాజస్థాన్ ఆ మాత్రం స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే రవిచంద్ర అశ్విన్ కూడా కెప్టెన్ తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఒక సిక్స్, 3 ఫోర్ల సాయంతో కేవలం 19 బంతుల్లో 28 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

Also Read: ప్లే ఆఫ్ కి వెళ్లే జట్లు ఇవే: హర్భజన్ సింగ్

ఈసారైనా ఆడుతాడనుకున్న ధ్రువ్ జురెల్ డక్ అవుట్ అయ్యాడు. బహుశా వచ్చే వేలంలో తనని కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవచ్చునని అంటున్నారు. రోవ్ మన్ పావెల్ (7), ట్రెంట్ బౌల్ట్ (12) చేశారు. మొత్తానికి 20 ఓవర్లలో 144 పరుగుల వద్ద పడుతూ లేస్తూ ముగించారు.

పంజాబ్ బౌలింగులో శామ్ కర్రన్ 2, అర్షదీప్ 1, నాథన్ 1, హర్షల్ పటేల్ 2, రాహుల్ చాహర్ 2 వికెట్లు పడగొట్టారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News