Union Bank Jobs: చాలామంది యువతీ యువకులు జీవితంలో రెండు రకాల ఉద్యోగాలు చేయాలని గోల్‌గా పెట్టుకుంటారు. ఒకటి బ్యాంకింగ్, మరొకటి టీచర్ జాబులు. ఎందుకంటే వీటికి నైట్ షిఫ్టులు ఉండవు. కేవలం జనరల్ షిఫ్టులు మాత్రమే ఉంటాయి. అందుకే వీటికి సంబంధించి నోటిఫికేషన్ రాగానే అప్లై చేస్తుంటారు. తాజాగా యూనియన్ బ్యాంక్ 500 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది.
యూనియన్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు యూనియన్ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్‌లో (https://www.unionbankofindia.co.in) ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ మే 20 వరకు మాత్రమే. ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తు పెట్టుకోవాలి.
ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్-క్రెడిట్ విభాగంలో 250 పోస్టులు, అసిస్టెంట్ మేనేజర్-ఐటీ విభాగంలో 250 పోస్టులు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు విద్యార్హత, వయో పరిమితిని బ్యాంక్ వెబ్ సైట్‌లో ప్రస్తావించారు. ఎంపిక విధానమేంటి?
ALSO READ: ఎఎఫ్ఎంఎస్ నుంచి భారీ నోటిఫికేషన్, పూర్తి వివరాలివే
తొలుత దరఖాస్తుల స్క్రీనింగ్ ఉంటుంది. ఎంపికైనవారికి ఆన్‌లైన్ ఎగ్జామ్ ఉంటుంది. సెలక్ట్ అయినవారికి గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది. ఈ పోస్టులకు ఎంపిక చేయడానికి అన్ని పద్ధతులను నిర్ణయించే అధికారం బ్యాంకుకు ఉంది. ఇక ఆన్‌లైన్ పరీక్షకు సంబంధించిన క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ వంటి ప్రశ్నలు ఉండనున్నాయి.
పరీక్షలు ఇంగ్లిష్-హిందీ పద్ధతిలో ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.177- (జీఎస్టీతో కలిపి) చెల్లించాలి. మిగతా కేటగిరీ అభ్యర్థులకు రూ.1180- (జీఎస్టీతో కలిపి) అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. డెబిట్ కార్డులు రూపే, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో ద్వారా చెల్లించవచ్చు. క్రెడిట్ కార్డులైతే ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, క్యాష్ కార్డులు, మొబైల్ వాలెట్లు, యూపీఐ ద్వారా సౌలభ్యాన్ని ఉపయోగించుకోవచ్చు.