BDL Jobs : సంగారెడ్డి జిల్లా భానూర్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్)లో 119 అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి. డిప్లొమా అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆ సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ లకు శిక్షణ సమయంలో రూ. 9 వేలు స్టైపెండ్ గా ఇస్తారు. టెక్నీషియన్ అప్రెంటిస్ లకు రూ. 8 వేలు ఇస్తారు. అభ్యర్థులు ఆన్ లై న్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులు సమర్పించేందుకు నవంబర్ 25 వరకు గడువు ఉంది.
టెక్నీషియన్ అప్రెంటిస్: 83 ఖాళీలు
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 36 ఖాళీలు
అర్హత: సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా/ డిగ్రీ ఉత్తీర్ణత
విభాగాలు: మెకానికల్, సీఎస్‌ఈ/ ఐటీ, ఈసీఈ, ఈఈఈ, సివిల్, ఈఐఈ, కెమికల్
స్టైపెండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.9000, టెక్నీషియన్ అప్రెంటిస్‌లకు రూ.8000
శిక్షణ వ్యవధి: ఏడాది
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25-11-2022
వెబ్‌సైట్: https://bdl-india.in/apprentice-connect