Big Stories

Entrance Door : ప్రహరీ ద్వారం ఇలా లేకపోతే వాస్తుదోషమేనా!

Entrance Door : ఇంటికి ప్రధాన ద్వారం ఎంత ముఖ్యమో, ప్రహార ద్వారానికి అంతే కీలకం. ఇంటి దిక్కుల బట్టి ప్రహరీ ద్వారం ఏర్పాటు చేసుకోవాలి. తూర్పు వీధి గృహానికి ముఖద్వారమునకు ఎదురుగా ప్రహారీకి గేటు ఉండాలి. గృహమునకు ఉత్తర ప్రాంతములో ఎక్కువ ఖాలీ స్థలము వున్నప్పుడు గృహ ముఖద్వారమునకు ఎదురుగా ప్రహారీకి గేటు చేటు కలిగిస్తుంది. ఉత్తర ప్రాంతము ఎక్కువ ఖాళీ స్థలము ఉంటే తూర్పు వీధి గృహస్థులు ప్రహారీకి ఈశాన్య ప్రాంతములో గేటు వుంచుకోవడం శుభం కలిగిస్తుంది.

- Advertisement -

దక్షిణ వీధి గృహమునకు ప్రహారీలో గేటును పెట్టే సమయంలో చాలా మంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. దక్షిణ ఆగ్నేయ ముఖద్వారమునకు ఎదురుగా ప్రహారీలో గేటును ఉంచకూడదు. ఆగ్నేయ వాయవ్య నడకలు మంచిది కాదు. దక్షిణ వీధి గృహమునకు ముఖ ద్వారమునకు ఎదురుగా ప్రహారీ ఎత్తుకు సరిసమానంగా గేటు కూడా వుండాలి.

- Advertisement -

గేటును బాగా మందంగా చేయించుకోవాలి. ఐరన్‌ కడ్డీలతో పాటుగా ఒక ఇనుప రేకును కూడా బిగించుకోవడం వల్ల మంచి ఫలితాలు వుంటాయి.ప్రహారీ గోడకు మధ్యమములో గేటును వుంచుకోవడం మంచిది.గేటును ఎంత మందముగా చేయించుకుంటే అంత మంచిది అని గమనించాలి.

గేటు ఎత్తు ప్రహారీ కన్నా ఎత్తుగా ఉన్నను ఏ దోషము లేదు. అయితే ఈ ఎత్తు అనేది రెండించులు లేదా మూడించులు మించకూడదు. .ప్రహారీ ఎత్తు కన్నా గేటు తక్కువ ఎత్తులో వుండరాదు. ప్రహారీకి సమానంగా గేటు రావడం మంచిది.

పశ్చిమ దిక్కు గృహాల్లో పశ్చిమ వాయవ్యం యందు గేటు వుంది కదా అని గృహము ముఖద్వారము నకు ఎదురుగా ప్రహారీలో గేటు వుంచుకోకపోవడం తప్పు.
తప్పని సరిగా ప్రహారీకి గృహ ముఖద్వారమునకు ఎదురుగా గేటు ఉంచుకోవడం మంచిది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News