Pradosha Kalam : సూర్యాస్తమయం నుంచి 2 గంటల 24 నిమిషాల సమయాన్ని ప్రదోష కాలం అని కొందరు , సూర్యాస్తమయమయ్యాక మూడు గడియలు రాత్రికి ఆరంభ కాలమే ఈ ప్రదోష సమయం అని కొందరు. ప్రదోష సమయం ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ప్రదోషమంటే అది ఒక కాల విశేషము.
ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయములో చంద్రుడి కదలికలతో ఏర్పడేది ప్రదోషము. ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయమునకు తిథి మారితే , అప్పుడు ప్రదోషము కలిగే అవకాశము ఉంది. త్రయోదశినాడు కలిగే ప్రదోషాన్ని మహా ప్రదోషం అంటారు.
దోషాలను హరించే ప్రశస్తమైన కాలాన్ని ప్రదోషకాలం అంటారు. సూర్యుడు అస్తమించే సమయంలో తిథి మారితే అది ప్రదోషకాలం.
శనివారం , త్రయోదశి , ప్రదోషం మూడూ కలిస్తే అవి శుభఘడియలుగా భావించవచ్చు. శని ప్రభావంతో ఇక్కట్ల పాలవుతున్నవారికి శని ప్రదోష సమయం దైవానుగ్రహ కాలంగా భావిస్తుంటారు. ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమభాగాన పార్వతి దేవి రెండవ భాగమున పరమేశ్వరరూపంగా అర్థనారీశ్వరుడుగా దర్శనమిచ్చేకాలం ఈ ప్రదోషకాలం హిమాలయాలలో , కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాలలో పరమశివుడు నాట్యం చేస్తూ ఉంటాడు. ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు దుష్ట సంహారం చేసేటప్పుడు కూడా స్వామి నాట్యం చేస్తూ ఉంటాడట.