E-Paper
Advertisement

Shani Dev: శని గ్రహ.. అనుగ్రహం కలగాలంటే.. !

Shani Dev: శని గ్రహ.. అనుగ్రహం కలగాలంటే.. !
Advertisement

Shani Dev: జాతకరీత్యా గ్రహదోషాలున్న వారు జీవితంలో పలు రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా జాతకరీత్యా శని దోషం ఉన్నవారిలో వివాహం కాకపోవటం, తరచూ ప్రమాదాల పాలవటం, కుటుంబ కలహాలు, వృత్తి ఉపాధుల్లో రాణించలేకపోవటం వంటి సమస్యలుండే అవకాశం ఎక్కువ. వీరు శని పూజ, జపం వంటివి చేయటం ద్వారా ఈ దోష ప్రభావం నుంచి బయటపడవచ్చని జ్యోతిష పండితులు సూచిస్తున్నారు.

సాధారణంగా శని దోషాలతో బాధపడేవారు శనీశ్వరునికి ఇష్టమైన రోజు శనివారం, నల్లటి లేదా నీలిరంగు పువ్వులతో పూజించటం, శని త్రయోదశి రోజు నువ్వుల నూనెతో దీపారాధన, అభిషేకం చేయటం వల్ల శని అనుగ్రహం కలుగుతుంది. శనిగ్రహ అనుగ్రహం కోసం శనివారం రోజున రావిచెట్టుకు సూర్యోదయ సమయంలో నీరుపోసి, అక్కడ ఆవాల నూనెతో నాలుగు ఒత్తులతో దీపారాధన చేసి, చెట్టుకు ప్రదక్షిణ చేయటం మంచింది.

Advertisement

శనివారం రోజున హనుమాన్ చాలీసాను పారాయణ, ఆ రోజున నల్ల నువ్వులు, నల్ల గొడుగు, మినుములు, నల్లని పాదరక్షలు దానం చేయటం వల్ల శనిదోషం తొలగిపోతుంది. శనివారం నాడు ఒక గిన్నెలో నువ్వులనూనె తీసుకుని అందులో మీ ముఖాన్ని చూసుకుని, శనీశ్వరుడిని మనసులో స్మరించుకుని, ఆ నూనెను ఆలయంలో దానం చేయటం, శనివారం రోజున కాకులకు, చీమలకు ఆహారం వేయటం కూడా మంచి ఫలితాలనిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌‌లోని మందపల్లి, మహారాష్ట్రలో శని శింగనాపూర్‌, తమిళనాడులో తిరునళ్ళార్‌ శని క్షేత్ర దర్శనం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×