BigTV English

Gods Promise: మనుషులే దేవుడిపై ప్రమాణం చేయడం ధర్మబద్ధమేనా

Gods Promise: మనుషులే దేవుడిపై ప్రమాణం చేయడం ధర్మబద్ధమేనా

Gods Promise:ఒట్టు వేయడం, ప్రమాణం చేయడంలో పూర్వాకాలంలో లేవు. ఇవన్నీకలియుగంలో మొదలైన పిశాచ లక్షణాలు . చిన్నా విషయానికి పెద్ద దానికి కూడా కొంతమంది ప్రమాణాలు చేస్తుంటారు. ఇలాంటివి ఏమాత్రం మంచిది కాదు. ఆంజనేయుడు మాత్రమే ఒక్కే ఒక్కసారి దుఃఖిస్తూ ప్రమాణం చేశాడు. రాముడి, సీత ఎక్కడున్నారో ఒకరికి ఒకిరికి చెప్పిన తర్వాతే వస్తానని రామాయణంలో ఆంజనేయుడు
ప్రతిజ్ఞ చేశాడు. జీవితంలో ఒక మంచి చేసేందుకు మాత్రమే నాడు ఆంజనేయుడు ఒట్టువేశాడు . కానీ ఈ రోజుల్లో ప్రతీ చిన్న విషయానికి నెత్తి మీద ఒట్టు పెట్టడం సరికాదని పెద్దలు చెబుతున్నారు. నువ్వు చెప్పింది చేస్తానని నాడు దశరథుడు ఒట్టు పెట్టాడు. రాముడి మీద ఒట్టేసి మరీ చెప్పాడు.


ఈ రోజుల్లో ఒట్టు పెట్టేంత సత్యసంధులు మనం కాదు. ఒక నియమానికి కట్టుబడి ఉంటే శక్తిమంతులు కూడా కాదు. కాలం కూడా మనల్ని అలా ఉంచనివ్వదు. కాబట్టి దొంగ ప్రమాణాలు చేయడం వద్దు. అతనడు అన్నాడంటే నిజమే అనే మాట నిరూపించుకోవాలి. ఒక వ్యక్తి అందరి దగ్గర ఒకే మాట వినిపించే వ్యక్తి శీలవంతుడు. అలాంటి వ్యక్తి ప్రతిజ్ఞ చేయక్కర్లేదు. ఒక వేళ చేసినా భయపడాల్సిన పనికూడా ఉండదు. మొగడు, పెళ్లాలు కూడా ఉద్యోగ్యాలు చేస్తున్న ఈరోజుల్లో పిల్లల మీద ఒట్టు వేసి తప్పించుకోవాలని అనుకుంటారు. పిల్లల మీద ఒట్లు వేయడం కూడా ఆయుః క్షీణం.

అబద్దాలు చెప్పడానికి ఎక్కువమంది ఒట్లు వేస్తుంటారు . దేవుడి మీదో ఇంకో దాని మీద ఒట్టు వేసి ఇతరుల్ని నమ్మిస్తుంటారు. అలాంటి వారికి అవమానాలు ఎదురవుతూనే ఉంటాయి. అందుకు కర్మఫలం అనుభవించతప్పదు. ఒకరిని మోసం చేసేందుకు అబద్దం చెబుతూ ఒట్టుపెడితే అది జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. దేవుడిపై ఒట్టేసి చెప్తే ఇక మీకు ప్రకృతి సహకరించదు. తల్లితండ్రులు చేసిన పుణ్యఫలం అప్పటి వరకు బాగున్నా….ఆ తర్వాత ఘోర మృత్యువును ఎదుర్కోక తప్పదు. అంటే జీవితంలో ఊహించలేని పెద్ద రోగం కలుగుతుందట. గాడ్ ప్రామిస్ మదర్ ప్రామిస్ అంటూ చేసే వాళ్లు అబద్దం చెబితే అకాల మృత్యువును ఎదుర్కోకతప్పదని గరుడ పురాణం చెబుతోది. దీర్ఘకాలిక వ్యాధులు కూడా సంభవిస్తాయట. పిల్లలపై ఒట్టు వేస్తే పుత్ర శోకం, పుత్రికా శోకం అనుభవిస్తారు.


Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×