E-Paper
Advertisement

Congress: దిగ్విజయ్ ముందు బిగ్ టాస్క్.. సీనియర్లు దారికొచ్చేనా? కలిసి పనిచేసేనా?

Congress: దిగ్విజయ్ ముందు బిగ్ టాస్క్.. సీనియర్లు దారికొచ్చేనా? కలిసి పనిచేసేనా?
Advertisement

Congress: తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ల కల్లోలం కొన్నిరోజులుగా రగులుతోంది. కొత్త కమిటీలతో అది మరింత ఎగిసిపడింది. కొందరు అసంతృప్తులు తిరుగుబాటు జెండా ఎగరేయడం.. కౌంటర్ గా 12 మంది టీడీపీ వలస నేతలు తమ పదవులకు రాజీనామా చేయడంతో.. వివాదం మరింత ముదిరింది. మంగళవారం సీనియర్లు కీలకభేటీకి సిద్దమవడంతో.. ఇక తప్పేలా లేదని అధిష్టానం రంగంలోకి దిగింది. సమస్య పరిష్కరించే బాధ్యతను దిగ్విజయ్ సింగ్ కు అప్పగించింది. ఆ వెంటనే పని మొదలుపెట్టేసిన దిగ్గీరాజా.. కొందరు సీనియర్లకు ఫోన్లు చేసి మీటింగ్ ను వాయిదా వేయించడంలో సక్సెస్ అయ్యారు. గురువారం ఆయనే స్వయంగా హైదరాబాద్ రానున్నారు.

దిగ్గీరాజా వస్తున్నారు సరే. మరి, సమస్య పరిష్కారం అంత సులువా? అనే ప్రశ్న. దిగ్విజయ్ కు తెలంగాణ పాలిటిక్స్ పై మంచి అవగాహన ఉంది. గతంలో ఆయన రాష్ట్ర ఇంఛార్జ్ గా చేశారు. ప్రస్తుత సీనియర్లలో చాలామందితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే ఆయన్ను ట్రబుల్ షూటర్ గా ముందుంచింది హైకమాండ్. అయితే, దిగ్విజయ్ రాకముందే ఆయనకు ముల్ల బాట పరుస్తున్నారు సీనియర్లు.

Advertisement

దిగ్గీరాజా రాకను స్వాగతిస్తూనే.. ఆయనకు పలు ప్రశ్నలు సంధించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కొత్త కమిటీల్లో పైరవీకారులకే ఎలా చోటిచ్చారు? హుజురాబాద్ ప్రచారానికి రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్లలేదు? మునుగోడులో తనను బూతులు ఎందుకు తిట్టించారు? తన మీద మార్ఫింగ్ వీడియోలపై విచారణ ఎందుకు చేయడం లేదు? ఇలా నిలదీతలతో అధిష్టానం దూతకు వెల్ కమ్ చెప్పారు కోమటిరెడ్డి.

మరోవైపు, సీనియర్లు సైతం కాస్త చల్లబడినట్టున్నారు. తాము ఎవరి రాజీనామాలను కోరలేదంటూ.. ఆ 12 మంది నేతల రాజీనామాలపై భట్టి విక్రమార్క స్పందించారు. కొత్త వారికి పదవులు కట్టబెట్టారు కానీ, తాము సూచించిన వారికి పోస్టులు ఇవ్వలేదనేదే తమ అభ్యంతరమంటూ చెప్పుకొచ్చారు. ఈ విషయాలన్నీ దిగ్విజయ్ ముందు ఉంచుతామని.. తమ అసంతృప్తిని అధిష్టానానికి తెలియజేయాలని కోరుతామని అన్నారు. అలా అంటూనే.. నేరుగా రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ పైనే విమర్శలు సంధిస్తున్నారు. అంతా ఆయనే చేశారంటున్నారు.

Advertisement

దిగ్గీ వస్తారు.. సీనియర్లతో మాట్లాడుతారు.. వారంతా రేవంత్ రెడ్డిపై, కొత్త కమిటీలపై ఫిర్యాదులు చేస్తారు.. రేవంత్ సైతం తన వర్షన్ వినిపిస్తారు.. అందరికీ నచ్చజెప్పుతారు.. అంతా ఒక కుటుంబంలా కలిసుండాలని.. సర్దుకుపోవాలని సూచిస్తారు. ఆనక ఆయన ఢిల్లీ వెళ్లిపోతారు. అంతేగా.. జరిగేది ఇంతేగా…అంటున్నారు. దిగ్గీ మాటలకు సీనియర్లు తలూపుతారా? అలాగని, రేవంత్ ను కాదని.. సీనియర్లకు ఆధిపత్యం కట్టబెడతారా? రేవంత్ వర్గం, సీనియర్ల టీం.. కలిసిమెలిసి పని చేసే అవకాశం ఇంకా ఉందా? ప్రచారం జరుగుతున్నట్టుగా తిరుగుబాటు నేతలు బీజేపీలో చేరిపోతారా?

Related News

తెలంగాణ కేబినెట్ ప్రక్షాళనలో ఊహించని ట్విస్ట్.. సీనియర్లకు బిగ్ షాక్!

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరికిందుకు బీఆర్ఎస్ బిగ్ స్కెచ్.. ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..!

డిప్యూటీ సీఎం ఇస్తేనే కేబినెట్‌లోకి వెళ్తా.. ఏఐసీసీకి మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్‌!

కాంగ్రెస్ పార్టీకి ఉహించని షాక్.. ఆ విషయంలో ఇక అన్ని పార్టీలు అటువైపే..?

రెండేళ్లు చాన్సివ్వండి.. ప‌రిస్థితిని చ‌క్క‌దిద్ది..ప‌రీక్ష‌లో మంచి మార్కులు తెచ్చుకుంటా! ఆ త‌రువాత మీ జీత‌భ‌త్యాలు నేను చూసుకుంటా!

కృష్ణా నీటి వివాదంపై తేలని పంచాయితీ.. కీలక వ్యాఖ్యలు చేసిన కేఆర్ఎంబీ!

కేటీఆర్ జెన్‌జీ మంత్ర.. విద్యార్థులు, నిరుద్యోగుల‌తో ఢిల్లీ బాట‌..! జెన్‌జీ మ‌న‌సు గెలుచుకునే ప్ర‌య‌త్నం..

ఫోక్స్‌వ్యాగన్‌లో భారీ లేఆఫ్స్.. లక్ష మంది ఉద్యోగులకు షాక్!

Big Stories

Advertisement
×