BigTV English

Tulsi Leaf : తులసి ఆకుల్ని మగవారే ఎందుకు కోయాలో తెలుసా…

Tulsi Leaf : తులసి ఆకుల్ని మగవారే ఎందుకు కోయాలో తెలుసా…

Tulsi Leaf: హిందూమతంలో తులసమ్మకు ఎంతో ప్రాధాన్యం ఉంది. తులసి లేని ఇళ్లు ఉండవు. తూర్పు దిక్కులో ఉండే తులసి మొక్కకు ఇంటికి శ్రేయస్సు. ప్రతి రోజు ఉదయమే తులసిని దర్శించుకుంటే ఎంతో పుణ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉత్తర దిక్కులో తులసి ఉండటం వల్ల ధన సమృద్ధి ఉంటుంది. ఈశాన్యం వైపు ఉంటే అధికారం కలుగుతుంది. తులసి మొక్క దగ్గర దీపం పెడితే ఐశ్వర్యం కలుగుతుంది.


ఆడవారు తులసిని పూజించే విధానాన్ని, ఆవశ్యకతను ప్రత్యేకంగా చెప్పారు. ఇంటి దేవత ప్రతీ రోజు భక్తితో తులసమ్మను పూజించాలని చెబుతోంది. అయితే తులసి ఆకుల్ని మాత్రం మహిళలు ఎట్టి పరిస్థితుల్లో కోయరాదని చెబుతున్నాయి. శుక్రవారం, ఆదివారం, ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి రోజుల్ల తులసిని, ఉసిరి పత్రాన్ని కోయకూడదట. అలాగే ఇంట్లో తులసి మొక్కను నాటడం, తొలగించడం మగవారే చేయాల, మగవారు కోసిన తులసితోనే పూజించాలని శాస్త్రం చెబుతోంది. తులసిని కోసేటప్పుడు స్తుతించి నమస్కరించి పురుషులు కోయాలి.

ఒక స్త్రీని మరో స్త్రీ స్పృశించకూడదన్న నానుడి ఉంది. శుచిగా లేకుండా మొక్కల దగ్గరకు వెళ్లకూడదని పల్లెల్లో చెబుతుంటారు. అశుచిగా ఉండేవాళ్లు తులసి దగ్గరకు వస్తే ఎండిపోయే ప్రమాదం ఉంది. మహిళలకు ఉండే కొన్ని ప్రత్యేక సందర్భాల వల్లే అలాంటి వల్లే పురుషులో తులసి ఆకుల్ని కోయాలని చెప్పారు. కానీ అన్ని వేళ్లలా…అన్ని సందర్భాలకు ఇది వర్తించదు.


ప్రతి రోజు తులసి మొక్కకు పూజ చేయాలని అయితే దానికి నీళ్లు మాత్రం ఉదయం పూట సూర్యకాంతి పడుతున్నప్పుడు పోయాలని చెబుతారు. స్నానం చేయకుండా తులసి మొక్కను ముట్టుకోకూడదు. అలా కానీ చేయడం వల్ల మంచిది కాదనే నమ్మకం ఉంది. అలాగే ఆదివారం పూట తులసి చెట్టుకు నీళ్లు పోయకూడదని పెద్దలు చెబుతుంటారు.

Tags

Related News

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Big Stories

×