BigTV English

AP Cabinet Meeting: సిలిండర్లపై మూడు గ్యాస్‌ కంపెనీలతో ఒప్పందం.. మంత్రి నాదెండ్ల మనోహర్‌

AP Cabinet Meeting: సిలిండర్లపై మూడు గ్యాస్‌ కంపెనీలతో ఒప్పందం.. మంత్రి నాదెండ్ల మనోహర్‌

AP Cabinet Meeting Key decisions: రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాకు వెల్లడించారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఉచిత గ్యాస్ సిలిండర్లపై సుదీర్ఘంగా చర్చలు జరిగినట్లు వివరించారు.


దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లను ఇవ్వనుందని చెప్పారు. అయితే ఈ సిలిండర్లను ఒకేసారి కాకుండా నాలుగు నెలలకు ఒకటి ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. మొదట నగదు చెల్లించి సిలిండర్ కొనుగోలు చేస్తే.. 48 గంటల్లో తిరిగి అకౌంట్‌లోకి నగదు జమ చేసేలా నిర్ణయించారన్నారు. ఒకవేళ జమ కాకుంటే గ్రామ, వార్డు సచివాలయాల్లో సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ.2700 కోట్ల భారం పడనుందని వివరించారు.

ప్రతి ఏడాది రూ.2700కోట్లతో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి వివరించారు. ఈ నెల 31 ఈ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది మూడు సిలిండర్లు ఇచ్చేందుకు ఒక షెడ్యూల్ ను ఖరారు చేశామన్నారు. ఇందులో భాగంగానే ఆగస్టు 1 నుంచి నవంబర్‌ నెలాఖరు వరకు రెండో సిలిండర్‌ పంపిణీ చేస్తామని తెలిపారు. డిసెంబర్‌ నుంచి మార్చి 31 వరకు మూడో సిలిండర్‌ పంపిణీ చేస్తామన్నారు. సిలిండర్లపై మూడు గ్యాస్‌ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా స్పష్టం చేశారు.


Also Read: తీవ్ర తుఫానుగా మారనున్న దానా.. గంటకు 90 నుంచి 120km వేగంతో గాలులు

కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉచిత ఇసుక విధానంలో సీనరేజ్, జీఎస్టీ రద్దుకు ఆమోదం తెలిపింది. సీనరేజ్‌ ఛార్జీల రద్దుతో ప్రభుత్వంపై రూ.264 కోట్ల భారం పడుతున్నట్లు అంచనా వేశారు. అంతేకాకుండా శారదాపీఠానికి భూముల కేటాయింపును రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. పట్టా భూముల్లో ఎవరి ఇసుక వారు తీసుకునేందుకు సైతం ఆమోదం తెలిపింది. ఆలయ కమిటీల్లో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు చోటు, సభ్యుల సంఖ్యను పెంచేందుకు చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×