BigTV English

Kanguva : సూర్య ‘కంగువ’ కు తెలుగు స్టార్ హీరోల సపోర్ట్.. మన హీరోలంటే అంత చిన్న చూపా..? 

Kanguva : సూర్య ‘కంగువ’ కు తెలుగు స్టార్ హీరోల సపోర్ట్.. మన హీరోలంటే అంత చిన్న చూపా..? 

Kanguva : తమిళ స్టార్ హీరో సూర్య సినిమాలకు తెలుగులో మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే.. ఈయన సినిమాలకు ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఉంది. సూర్య నటించిన ఎన్నో సినిమాలు తెలుగులోకి కూడా వచ్చాయి. ఆయనకు తెలుగు హీరోలతో సంబంధాలు కూడా ఉండటంతో ఇప్పుడు ఆయన నటిస్తున్న సినిమాలతో స్టార్ హీరోలా సపోర్ట్ దొరికిందని ఓ వార్త ఇండస్ట్రీలో షికారు చేస్తుంది. అసలు మ్యాటర్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం..


ప్రముఖ కోలీవుడ్ స్టార్ సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్-ఫాంటసీ చిత్రం ‘కంగువ’ నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ప్రమోషన్స్ కూడా ఎంతో ఉత్సాహంగా, వేగంగా జరుగుతున్నాయి. ఇటీవల, సూర్యతో పాటు బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, అందాల తార దిశా పటానీలు కలిసి ముంబై, ఢిల్లీ నగరాల్లో హిందీ వెర్షన్ కోసం గట్టిగానే ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇటీవల ఈ ముంబై లో సందడి చేసిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియా చక్కర్లు కొడుతుంది.

ఇదిలా ఉండగా సూర్య అక్టోబర్ 24న సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని AMB సినిమాస్‌ లో తెలుగు మీడియాతో ప్రత్యేక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశం ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకులతో మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నించబోతున్నారు. కంగువ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరో న్యూస్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. సూర్య త్వరలోనే రెండు ప్రముఖ తెలుగు టెలివిజన్ షోలలో కనిపించనున్నారు. ఒకవైపు, అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ తెలుగు 8’ రియాలిటీ షోలో అతిథిగా ఉండగా, మరోవైపు బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షోలో కూడా అతిధిగా వచ్చేందుకు రెడీ అవుతున్నాడని సమాచారం. ఈ వార్తలో నిజమేంత ఉందో తెలియదు కానీ ఈ వార్త వైరల్ అవ్వడంతో తెలుగులోని సూర్య అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక మరోవైపు ట్రోల్స్ కూడా వినిపిస్తున్నాయి. తెలుగు హీరోలకు మీరు ఎప్పుడు సపోర్ట్ చెయ్యరు వేరే హీరోలంటే ఎందుకు మీకు అంత అభిమానమో అని నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.


ఇక శివ దర్శకత్వం లో రూపొందిస్తున్నారు. స్టూడియో గ్రీన్, UV క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సూర్య ఈ సినిమాలో విభిన్నమైన గెటప్‌లో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో సూర్య ను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక సూర్య తన కెరీర్‌ లో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించినప్పటికీ, ఈ చిత్రం ఆయనకు మరో మైలురాయిగా నిలుస్తుందని అందరూ నమ్ముతున్నారు. మరి సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×