E-Paper
Advertisement

Game Changer: ఎట్టేకలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసిందోచ్..

Game Changer: ఎట్టేకలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసిందోచ్..
Advertisement

Game Changer:  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ ఛేంజర్. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంజలి, శ్రీకాంత్,  జయరామ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా  ఆకట్టుకున్నాయి. అన్ని బావుండి ఉంటే ఈపాటికి ఈ చిత్రం ప్రమోషన్స్  లో బిజీగా ఉండేది. కానీ, శంకర్ షూటింగ్ గురించి అందరికి తెల్సిందే. రాజమౌళి తరువాత  ఒక సినిమాకు అంత ఎక్కువ టైమ్ తీసుకొనే దర్శకుడు అంటే  శంకర్ అనే చెప్తారు.

Advertisement

జరగండి జరగండి సాంగ్ తరువాత గేమ్ ఛేంజర్ నుంచి ఒక్క అప్డేట్ ఇవ్వలేదు.   దీంతో ఫ్యాన్స్ .. శంకర్ పై, దిల్ రాజు పై మండిపడుతున్నారు. ఎవరినైనా ఆపగలరు కానీ, మెగా ఫ్యాన్స్ ను ఆపడం చాలా కష్టమనే  చెప్పాలి. ఇక రామ్ చరణ్ సినిమా నుంచి అప్డేట్  ఇవ్వడం లేదని.. అసభ్యకరమైన పదాలను ఉపయోగించి ట్విట్టర్ లో ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. దీనిపై  మ్యూజిక్ డైరెక్టర్ థమన్  కూడా సీరియస్  అయ్యాడు.

ఇలా  అసభ్యకరమైన   మాటలను ట్రెండ్ చేయడం వలన ఉపయోగం ఏంటి.. ? దీనివలన సినిమాకు చెడ్డ  పేరు వస్తుంది అంటూ మండిపడ్డాడు. అయినా కూడా ఫ్యాన్స్ వదలలేదు. ఇక ఫ్యాన్స్  ఆగ్రహం చూసిన  మేకర్స్ దెబ్బకు  దిగివచ్చారు. గేమ్ ఛేంజర్ అప్డేట్ రేపు వినాయక చవితి పర్వదినాన అందించనున్నట్లు   అధికారికంగా  తెలిపారు.

Advertisement

మరి రేపు అప్డేట్ అంటే.. రిలీజ్ డేట్ చెప్తారా.. ? టీజర్  గురించి చెప్తారా.. ? అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ అప్డేట్ వచ్చిన దగ్గరనుంచి   ఫ్యాన్స్  పండగ చేయడం మొదలుపెట్టారు.  మరి  రేపు ఏ అప్డేట్ వస్తుందో  చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×