E-Paper
Advertisement

Cyanide killers: గుంటూరులో సైనైడ్ గ్యాంగ్.. 4 హత్యలు, 3 హత్యాయత్నాలు.. నిందితులంతా మహిళలే

Cyanide killers: గుంటూరులో సైనైడ్ గ్యాంగ్.. 4 హత్యలు, 3 హత్యాయత్నాలు.. నిందితులంతా మహిళలే
Advertisement

Guntur Police arrest Three Women Criminals Involved in Cyanide Murders: గుంటూరు జిల్లాలో సైనైడ్‌ కిల్లర్స్‌. రెండేళ్లలో నాలుగు హత్యలు, మూడు హత్యాయత్నాలు. నిందితులంతా మహిళలే. నాలుగు హత్యల్లోనూ ఫాలో అయింది ఒకే ప్యాట్రన్. ఆహార పదార్థాల్లో సైనైడ్‌ కలిపి మర్డర్స్‌ చేయడం వారి స్పెషాలిటీ. గుంటూరు జిల్లాలో ఈ ఏడాది జూన్‌లో జరిగిన హత్యకేసును ఛేదించే క్రమంలో మిగతా మూడు హత్యలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముగ్గురిలో వెంకటేశ్వరి అలియాస్ బుజ్జి మెయిన్. ఆమె తల్లి రమణమ్మ కూడా నిందితుల్లో ఒకరు.

వారిద్దరికి తోడు రజనీ అనే మహిళ కూడా ఉంది. ఇలా వీరు ముగ్గురు కలిసి 2022 నుంచి నేరాలు చేస్తూ వస్తున్నారు. సైనైడ్ తో చంపేస్తున్నారు. సైనైడ్ కలిపి పదార్థం తీసుకోవడం వల్ల గుండె ఆగిపోతోంది. దాంతో అందరూ హార్ట్ ఎటాక్ అనుకొని కేసులు కూడా పెట్టడం లేదు. కానీ మొన్న జూన్ లో ఓ మహిళను చంపారు. మృతురాలి కొడుకు కేసు పెట్టడంతో పోలీసులు విచారణ చేపట్టారు. దాంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.

Advertisement

Also Read:  వామ్మో పిల్లల ఐస్ క్రీమ్ లో విస్కీ..పోలీసుల అదుపులో నిందితులు

వెంకటేశ్వరి గతంలో వాలంటీర్ గానూ చేసింది. 2022లో ఆస్తి ఇవ్వనందుకు అత్తను, 2023లో 20 వేల కోసం నాగమ్మ అనే మహిళను చంపింది వెంకటేశ్వరి. 2024 ఏప్రిల్‌లో భూదేవి అనే మహిళ భర్తను కూడా సైనైడ్ తో హత్య చేసింది. వెంకటేశ్వరికి సహకరించిన భూదేవిపైనా కేసు నమోదు చేశారు. నిందితులకు సైనైడ్‌ విక్రయిస్తున్న వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. బంగారం దుకాణంలో వాడే సైనైడ్‌తోనే ఈ హత్యలు చేశారని పోలీసులు చెబుతున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×