E-Paper
Advertisement

‘Avatar’ technology:- పేషెంట్లకు అండగా నిలిచే ‘అవతార్’ టెక్నాలజీ..

‘Avatar’ technology:- పేషెంట్లకు అండగా నిలిచే ‘అవతార్’ టెక్నాలజీ..
Advertisement

‘Avatar’ technology:- ప్రస్తుతం సినిమాల్లో కూడా టెక్నాలజీని వినియోగించుకునే విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు మేకర్స్. ముఖ్యంగా సినిమాలే కోసమే కొత్త కొత్త టెక్నాలజీని తయారు చేసుకుంటున్న మేకర్స్ కూడా ఉన్నారు. అందులో ఒకరు జేమ్స్ కామెరాన్. ఇప్పుడు ఈ క్రియేటర్ ఉపయోగించిన ఓ టెక్నాలజీ వైద్య రంగానికి ఉపయోగపడనున్నట్టు తెలుస్తోంది.

జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన ‘అవతార్’లో ఓ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించారు. దీని ద్వారానే తన సినిమాలో పాత్రలకు ప్రాణంపోశారు. అయితే పలు వ్యాధులను ట్రాక్ చేయడంలో ఈ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీనే వైద్యులు ఉపయోగించడానికి సిద్ధమవుతున్నట్టుగా సమాచారం.

Advertisement

కొన్ని వ్యాధులు మనుషులలో ఒక్కసారిగా మార్పులు తీసుకువస్తాయి. అలాంటి వ్యాధులు వచ్చే ముందు ఏ సమాచారం ఉండదు. కానీ వచ్చిన తర్వాత వైద్యులు దానికి తగినట్టుగా చికిత్సను అందిస్తే వారు వెంటనే కోలుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అలాంటి వ్యాధులను గుర్తించడానికే మోషన్ క్యాప్చర్ పనిచేయనుంది.

శరీర కదలికలను కృత్రిమ మేధస్సు ద్వారా గుర్తిస్తుంది ఈ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ. దీని వల్ల వ్యాధులను త్వరగా గుర్తించడమే కాకుండా దానికి తగిన వైద్యాన్ని అందజేయడం మొదలుపెడితే వ్యాధి ప్రభావం వెంటనే తగ్గుతుందని ఇటీవల చేసిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే ఈ టెక్నాలజీని పదేళ్ల నుండి వారు డెవలప్ చేస్తున్నట్టుగా తెలిపారు. తాజాగా జెనటిక్ సమస్య ఉన్న పేషెంట్లపై ఈ టెక్నాలజీని ఉపయోగించి సక్సెస్ అయినట్టుగా బయటపెట్టారు.

Advertisement

బ్రెయిన్, గుండె సమస్యలు, ఖండరాలు.. ఇలాంటి పలు రకాల సమస్యలను గుర్తించడానికి మోషన్ క్యాప్చర్ పనిచేస్తుందని పరిశోధకులు తెలిపారు. మామూలుగా కొన్ని ఆరోగ్య సమస్యలను కనిపెట్టడానికి, వాటికి వైద్యం అందించడానికి చాలా సమయం పడుతుందని.. కానీ మోషన్ క్యాప్చర్ ఆ సమయాన్ని చాలావరకు తగ్గించిందని సంతోషం వ్యక్తం చేశారు. అవతార్ సినిమాల్లో మనుషులను ఏలియన్స్‌గా చూపించే టెక్నాలజీ నుండి ఈ మోషన్ క్యాప్చర్ పుట్టిందన్నారు.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×