BigTV English

Sri Anjaneya:- ఆంజనేయుడ్ని మహిళలు పూజించకూడదా…

Sri Anjaneya:- ఆంజనేయుడ్ని మహిళలు పూజించకూడదా…


Sri Anjaneya:– అజన్మబ్రహ్మచారి అయిన ఆంజనేయుడ్ని పూజిస్తే ధైర్యం, మనశ్శాంతి కలుగుతాయి. అ ఆదేవుడ్ని మగవారు మాత్రమే పూజించాలని ఆడవారు ఉపాసించకూడదన్న ప్రచారం ఉంది. కానీ అందులో వాస్తవం లేదంటున్నారు హిందూమత పెద్దలు. ఆంజనేయుడి పుట్టుక గురించి తెలుసుకుంటే రాముడు, హనుమంతుడు ఇద్దరు వేర్వరు కాదు. అగ్నిదేవుడు ప్రసాదించిన ప్రసాదం నుంచి పుట్టిన వాడే ఆంజనేయుడు. రాముడు కూడా అగ్నిదేవుడు ఇచ్చిన ప్రసాదం వల్లే కైకేయికి జన్మించాడు. హనుమంతుడు తన భక్తికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. రాముడే తన లోకమనుకున్నాడు. రాముడు తనలో ఉన్నాడనుకున్నాడు. అందుకే ఆంజనేయుడు హృదయస్పందన అంతా రామనామ స్మరణే వినిపిస్తుంది.

కాబట్టి భక్తి ప్రాధాన్యం దృష్ట్యా ఆంజనేయుడ్ని మహిళలు పూజించవచ్చు. ఆరాధించవచ్చు. ఆంజనేయుడు బ్రహ్మాచారి అయినంత మాత్రం స్త్రీల నమస్కారాలు తీసుకోవద్దని ఏ పురాణాల్లోను, శాస్త్రాల్లోను ప్రస్తావించలేదు. సీత జాడ కోసం వెతుకుతూ రాముని ఆదేశాల మేరకు లంకకి వెళ్లే సమయంలో ఆంజనేయుడు సముద్రాన్ని దాటాల్సి వస్తుంది. ఆ సమయంలో ఎదురైన వారి కోరికలను దాటుకుని ఎలా ముందుకెళ్లాడో అందరికి తెలుసు. ఆంజనేయుడికి స్త్రీ పురుష భేదం చూపలేదు. భగవంతుడు పూజించే వారిని చూడడు. వారిలోని భక్తిని మాత్రమే చూస్తాడు.


కానీ శక్తిఉత్పన్నమైన దేవుళ్ల విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. పూజలు చేయడం, ధ్యానం, పారాయణం చేసి మహిళలు ఆంజనేయుడ్ని పూజించవచ్చు . ఉపాసన విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. హనుమత్ దీక్ష చేసేటప్పుడు నియమాలు ఉంటాయి. ఉపాసన అంటే మంత్ర దీక్ష తీసుకునే చేసేది. ఈదీక్ష చేసేటప్పుడు కొన్నింటి వల్ల మహిళలకు సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఆంజనేయ స్వామికి శౌచయం చాలా ముఖ్యం. కొన్ని లక్షల సార్లు పలికే మంత్రం చాలా పవర్ ఫుల్. ఆ మంత్రం జపించే సమయంలో కొన్ని సార్లు ఆడవారికి సమస్యలు వస్తుంటాయి. ఆ పరిస్థితుల్లో కూడా మంత్రాన్ని జపిస్తే మంచి కన్నా చెడు జరుగుతుంది. అనర్దాలు జరిగే అవకాశాలున్నాయి. ఉపాసన ఆడవారు చేయకూడదని లేకపోయినా… ఈ ఇబ్బందులు కూడా వస్తాయని కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×