Big Stories

Biocomputers:- బయోకంప్యూటర్స్ తయారీపై దృష్టి.. బ్రెయిన్ సెల్స్‌తో..

Biocomputers:- మనిషి మెదడులోని ఆలోచన నుండే కంప్యూటర్ పుట్టింది. కానీ ఈ రెండు సమానంగా మనుషులకు ఉపయోగపడే స్థాయికి ఎదుగుతాయని ఎవరూ ఊహించలేదు. ఈరోజుల్లో మనిషి మేధస్సు ఎంత స్పీడ్‌గా పరిగెడుతుందో.. అంతే స్పీడ్‌తో దానికి పోటీగా ముందుకెళ్తోంది కంప్యూటర్ టెక్నాలజీ. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అనేది సాఫ్ట్‌వేర్‌కు కొత్త ఛాలెంజ్ విసరడంతో అడ్వాన్స్ కంప్యూటర్స్ పేరుతో మోడర్న్ టెక్నాలజీకి తెరలేపాలని టెక్ నిపుణులు అనుకుంటున్నారు.

- Advertisement -

మనిషి మేధస్సు, కంప్యూటర్ కలిసి పనిచేయడాన్నే బయోకంప్యూటర్ టెక్నాలజీ అంటారు. ఇప్పటికే చాలావరకు అభివృద్ధి చెందిన దేశాల్లోని సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్‌లో బయోకంప్యూటర్ టెక్నాలజీ అనేది ఫుల్ ఫార్మ్‌లో ఉంది. కంప్యూటర్‌లో ఉండే సిలికాన్ మాలిక్యూల్స్‌ స్థానాన్ని ఆర్గానిక్ మాలిక్యూల్స్‌తో భర్తీ చేయడమే బయోకంప్యూటర్ తయారీలో ముఖ్య ఘట్టం. అయితే ఇలాంటి మోడర్న్ టెక్నాలజీపైనే మనుషుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, అందుకే ఈ కంప్యూటర్ల తయారీ వేగవంతం చేయాలని నిపుణులు భావిస్తున్నారు.

- Advertisement -

మనిషి శరీరంలోని డీఎన్ఏ, ప్రొటీన్స్ వంటి వాటి సాయంతో బయోకంప్యూటర్ల తయారీ జరిగితే.. హ్యమన్ బయోలజీలో మాత్రమే కాదు.. టెక్నాలజీలో కూడా ఎన్నో మార్పులు వస్తాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఇలాంటి కంప్యూటర్లలో ఆర్గనాయిడ్స్ అనే టిష్యూల సాయం తీసుకుంటారు. ఈ టిష్యూలను ల్యాబ్స్‌లో పెంచినా కూడా ఇవి మనిషి శరీరంలోని కిడ్నీలు, ఊపిరితిత్తలు, బ్రెయిన్ సెల్స్‌లోని టిష్యూలతో పోలిఉంటాయి. గత రెండు దశాబ్దాలుగా ఆర్గనాయిడ్స్ అనేవి శాస్త్రవేత్తలకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూనే ఉన్నాయి. ఇప్పుడు బయోకంప్యూటర్ల తయారీలో కూడా ఇవే ముఖ్య పాత్రను పోషించనున్నాయి.

మనుషుల సెల్స్‌కు ప్రత్యామ్నాయంగా ఆర్గనాయిడ్స్‌ను ఎంతోకాలంగా ఉపయోగిస్తున్నారు శాస్త్రవేత్తలు. బయోకంప్యూటర్ల తయారీకి బ్రెయిన్ ఆర్గనాయిడ్స్ ఎక్కువగా ఉపయోగపడతాయని వారు అంటున్నారు. ఇవి అచ్చం మనిషి మెదడులో జరిగే న్యూరల్ ఫంక్షన్స్ లాగానే పనిచేస్తాయని వారు తెలిపారు. బ్రెయిన్ ఆర్గనాయిడ్స్‌ను బయోకంప్యూటింగ్‌లో ఉపయోగించడం వల్ల ఫ్యూచర్ టెక్నాలజీలో విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటాయని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

ఏఐకు ప్రత్యేకమైన గైడ్‌లైన్స్.. దేశంలోనే మొదటిసారి..

for more updates follow this link:-Bigtv

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News