BigTV English

“Breaking Coconut On Devotees’ Head!” : గిరిజన గ్రామంలో వింతాచారం

“Breaking Coconut On Devotees’ Head!” : గిరిజన గ్రామంలో వింతాచారం

“Breaking Coconut On Devotees’ Head!” : గిరిజిన గ్రామాల్లో వింత ఆచారాలుంటున్నాయి. దేవుడిపై నమ్మకంతో దేనికైనా సిద్ధపడుతుంటారు. ఏజెన్సీ వాసుల్లో అమ్మవార్ల పట్ల భక్తి విశ్వాసాలు ఎక్కువ..మొక్కు తీర్చుకునేందుకు వారు ఎంతటి సాహసమైనా చేస్తారు. తమిళనాడు కృష్ణగిరి జిల్లాలోని హోసూరు కనకదాస సేవా సమితి ఆధ్వర్యంలో కనకదాస 535వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కొబ్బరి కాయలు కొట్టడానికి భక్తుల తలలనే ఉపయోగించడం ఈ ఉత్సవం ప్రత్యేకత. భక్తులు ఆ విధంగా తమ భక్తిని చాటుకున్నారు. పూజారి చేతుల మీదుగా వందల సంఖ్యలో వరుసగా కూర్చున్న భక్తుల తలలపై 1,008 కొబ్బరికాయలు పగిలాయి. ఈ ఉత్సవాలకు తమిళనాడుతో పాటు చుట్టు పక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు హాజరయ్యారు.


తమ ఇష్టదేవత మహాలక్ష్మి అమ్మవారి మొక్కుతీర్చుకునేందుకు తలపై కొబ్బరికాయలు కొట్టించుకుంటారు. కోరిన కోరికలు నెరవేరాల్చాలని ఇలా చేస్తుంటారు. భక్తుల తలపై పూజారి కొబ్బరికాయలు కొడుతుంటే నెత్తిపై రక్తం కారుతున్నా దేన్నీ లెక్క చేయరు. గాయాలపై పసుపు, విభూది రాసుకుని వెళ్లిపోతుంటారు. ఈ ఆచారాన్ని గిరిజనులు తరతరాలుగా పాటిస్తున్నారు. .

గుడిలో దేవుడ్ని తలుచుకుని కొబ్బరికాయం అన్ని చోట్ల జరిగేదే. కాని ఇలా భక్తుల తలపైన కొబ్బరికాయను పగులకొట్టడం అసాధారణమే. ఆ సమయంలో కలిగే నొప్పిని దేవుడు తెలియకుండా చేస్తాడని గిరిజనులు బలంగా నమ్ముతుంటారు. ఈ కార్యక్రమం తర్వా వాళ్లెవరూ ఆస్పత్రికి కూడా వెళ్లరు. పరమశివుడికి మూడు కన్నులు ఉన్న విధంగా కొబ్బరికాయకు కూడా మూడు కన్నులు ఉంటాయని భావించి ఆ పరమశివుని ప్రసన్నం చేసుకోవడానికి తలపై కొబ్బరికాయలను పగలుగొట్టించుకోవడం ఇక్కడ ఆచారంగా వస్తోంది.


పండుగ రోజులలో భక్తులు తమదైన రీతిలో స్వామివారికి మొక్కులు తీర్చుకోవడం మనం చూస్తూనే ఉంటాం.ఈ క్రమంలోనే అగ్నిగుండం పై నడవడం, త్రిశూలం నాలుకకు పెట్టుకొని మొక్కులు చెల్లించడం వంటివి తరచూ మనం చూస్తూనే ఉన్నాం.

Tags

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×