BigTV English

Buddha : బుద్ధుని అష్టాంగ మార్గం పాటిస్తే జీవితంలో కష్టాలు పోయినట్టే…

Buddha : బుద్ధుని అష్టాంగ మార్గం పాటిస్తే జీవితంలో కష్టాలు పోయినట్టే…

Buddha : నారాయణుని దశావతారంలో బుద్ధావతారం ఒక అవతారంగా గుర్తించారు. మానవుడి సర్వ దుఃఖాలకు మనసే కారణం. మనస్సు నియంత్రణలో ఉన్న వానికి దుఃఖం లేదని , అహింసా జీవనమే దైవారాధనతో సమానమని బుద్ధుడు బోధించాడు. బుద్ధుడికి తండ్రి ఎంత రాజభోగాలు మధ్య పెంచినా, రాచరికపు యుద్ధవిద్యలు అన్నీ నేర్పించాడు. ఆ విద్యలలో సిద్ధార్థుడు అసమాన ప్రతిభ చూపే వాడు. ప్రపంచానికి జ్ఞానబోధ చేసిన బుద్ధుడు, కనిపెంచిన తల్లిదండ్రులను, భార్యను, కన్నబిడ్డను, రాజ్యాన్ని, రాజభోగాలను వదిలి, ఎవరికీ చెప్పకుండా, అర్ధరాత్రి వెళ్ళిపోయాడు.


ఉత్తమ జీవితానికి కావాల్సిన ఎనిమిది సూత్రాలను బుద్ధుడు చెప్పాడు. అదే అష్టాంగమార్గం. ఏవిషయమైనా బాగా ఆలోచించిన తర్వాతే అంగీకరించి ఆచరించాలి. మొహమాటంతోనే గాని, భయంతో గాని, గౌరవంతో గాని అంగీకరించకూడదని బుద్ధుడి చెప్పిన అష్టాంగ మార్గాల్లో మొదటి సూత్రం. ప్రతీ వ్యక్తికీ మంచి సంకల్పం ఉండాలి. లోకహితం కోసం దీక్ష వహించాలి. మంచి సంకల్పమే మంచి దారిన నడిపిస్తుంది. ఇది రెండవ సూత్రం. ఇతరులకు బాధ కలిగించే ఇతరులను నొప్పించే మాటలు మాట్లాడకూడదు. చాడి మాటలు అబద్ధాలుచెప్పకూడదు.

ఈ ప్రపంచం ఏ ఒక్కరిదికాదు. అన్ని ప్రాణాలకూ సమాన హక్కు ఉంది. కాబట్టి ప్రాణిహింస చేయకూడదు. ఇది నాలుగో సూత్రం. అందరూ మంచి జీవితాన్ని గడపాలి. దొంగతనం, వ్యభిచారం, మోసం దౌర్జన్యం మొదలైన వాటికి దూరంగా ఉండాలి.ఇది ఐదో సూత్రం. . దేహాన్ని మనస్సునీ బలంగాను, ఆరోగ్యంగాను ఉంచాలి. మానసిక శ్రమ దేహదండన కలిగిస్తూ ఉండాలి. ఇది ఆరో సూత్రం.


దుఃఖాన్ని, దురాశనూ, దురభిమానాన్ని వదిలివేయాలి. పిరికితనాన్ని దగ్గరకు రానీయకూడదు. ధర్మం మరవకూడదు. ఇది ఏడో సూత్రం. అష్టాంగ మార్గలో ఆఖరిది నిర్వాణం. పుట్టు చావులకు అతీతమైన ఉన్నతస్థితి. మనిషి పునీతుడై శరీరం మీద వ్యామోహం వదిలి లోకబంధం మరిచి మళ్లీ తిరిగి రావటానికి ఈ జన్మను పరిపూర్ణం చేసుకోవాలి.

జాతి వివక్షను బౌద్ధం అంగీకరిందు. ప్రతీ ప్రాణిని ప్రేమతోచూడాలని. ఇతరుల సంపదకు ఆశపడకూడదు. మత్తుపదార్ధాల సేవనం వల్ల మానవత నశిస్తుంది. వ్యభిచారం మహాపాప కార్యం. అతిపాప కార్యాలయాల్లో వ్యభిచారం మొదటిది.

Tags

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×