BigTV English

Sri Lakshmi Devi : పాలను తొక్కితే పాపమా…

Sri Lakshmi Devi : పాలను తొక్కితే పాపమా…

Sri Lakshmi Devi : శ్రీ మహాలక్ష్మి దేవి పాలలోనే పుట్టింది. పాలు లక్ష్మీదేవికి నివాస స్థానం. ఆ కారణం వల్లే పాలను తొక్కకూడదు అంటారు. ఒక చుక్క పాలు తయారు కావడానికి శరీరానికి ఎంతో శక్తి కావాలి. పాలలో ఎంతటి సంపూర్ణ శక్తి ఉందో అందరికి తెలుసు. తాగిన వెంటనే మనిషికి సమకూర్చేది పాలు ఒక్కటే. ద్రవాహారం లోపాలు, ఘనహారం చేప, ఈ రెండు ఆహారాలు అతి వేగంగా శరీరానికి శక్తినిస్తాయి.భగవంతుడికి నైవేద్యంగా అభిషేకాలు చేస్తూ నైవేద్యం సమర్పిస్తుంటాం. మరి అంత గొప్ప విశిష్టత కల్గిన పాలను మనం తొక్కితే పాపం చుట్టుకుంటుంది అని చాలా మంది చెబుతుంటారు.


పాలు అమతృంతో సమానమైనవి. ఏ కారణం వల్లైనా పాలుపు, పెరుగు, నెయ్యి, వృధా చేయడం పాపము. అందుకే మన పెద్దలు జీవన్నోత్తికి కారణమైన ఆవు, మేక, గుర్రం, మూడింటిని చేతితో అదలించాలే గానీ, కర్రతో కొట్టడం మహా పాపమని వేదాలు చెబుతున్నాయి. ఆవుని, మేకనీ, గుర్రాన్ని కొట్టకూడదు. మానవ జాతి వికాసానికి తోడుగా ఉన్న ప్రాణులు ఇవే. మనిషి తన మేధాశక్తితో తెలివితో సృష్టించలేనివి పాలు. పాలను కృత్రిమంగా ఏ మేథావీ సృష్టించలేం. పాలలోని గొప్పదనం అదే. ఏ మాతృమూర్తి అయినా తన చేతితో గ్లాసుడు పాలు ఇచ్చిందంటే ఆమె మను సొంత తల్లితో సమానమే. పాలు సమృద్ధిగా ఉన్న ఇంటిని శనీశ్వరుడు తన కడగంటినైన చూడడట. పాల వాసన ఉన్న ఇంటికి దరిద్ర దేవత రాదట.

శిశువుల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు తాగాలి. కానీ ఆయుర్వేదం ప్రకారం ఏదైనా శారీరక సమస్యలుంటే పాలు తాగకూడదు. ఆరోగ్యానికి పాలు చాలా మంచివి . వాటిలో క్యాల్షియం, ప్రొటీన్, మెగ్నీషియం, విటమిన్ ఎ, డి, ఇ మొదలైనవి పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు, దంతాలకు బలం చేకూరుతుంది.


Tags

Related News

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Big Stories

×