BigTV English

Electric Cars:ఈవీ కొంటున్నారా? ముందుగా ఏం తెలుసుకోవాలంటే..

Electric Cars:ఈవీ కొంటున్నారా? ముందుగా ఏం తెలుసుకోవాలంటే..

Electric Cars:భారతదేశంలో గత రెండేళ్లుగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఎలక్ట్రిక్ టూ వీలర్లతో పాటు, ఎలక్ట్రిక్ కార్లను కూడా వినియోగదారులు తెగ కొంటున్నారు. అయితే చాలా మంది… వాహనం ధర ఎంత? ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది? బ్యాటరీ, మోటర్ కెపాసిటీ ఎంత? ఎన్నేళ్లు వారంటీ ఇస్తున్నారు? అనే విషయాలు మాత్రమే తెలుసుకుంటూ ఉంటారు. కానీ, అన్నిటికన్నా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. అదే… బ్యాటరీ ధర. ఇది తెలుసుకోవాల్సిన పనేముందని అనుకుంటున్నారా? కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే… సంప్రదాయ ఇంధన వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలు చాలా డిఫరెంట్ కాబట్టి.


పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలకు రెగ్యులర్ సర్వీస్ ఖర్చులు మినహా… ఇంజిన్ విషయంలో వాటి జీవితకాలమంతా భరోసా ఉంటుంది. కానీ ఈవీలు అలా కాదు. ఎలక్ట్రిక్ టూ వీలర్ల బ్యాటరీలకు 3 నుంచి ఐదేళ్లు లేదా 40 నుంచి 50 వేల కిలోమీటర్ల వారెంటీ మాత్రమే ఇస్తున్నారు. అంటే… అంతకుమించి బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఉండదు. ఇక కొన్ని ఎలక్ట్రిక్ కార్ల కంపెనీలు 8 ఏళ్లు లేదా లక్షా 60 వేల కిలోమీటర్ల వారంటీ ఇస్తున్నాయి. వారెంటీ ఉండగా బ్యాటరీ పాడైపోతే చాలా కంపెనీలు ఉచితంగానే కొత్తది ఇస్తామంటున్నాయి. కానీ… వారెంటీ పీరియడ్ ముగిశాక బ్యాటరీ పాడైతే… వినియోగదారులే కచ్చితంగా కొత్త బ్యాటరీ కొనుక్కోవాలి. ఈవీ బ్యాటరీ ధర… మామూలు బైకులు, కార్లకు ఉండే బ్యాటరీ ధరలోనే అందుబాటులో ఉంటుందనుకుంటే పొరపాటే. ఈవీ ధరలో ఒక్క బ్యాటరీ విలువే సగానికిపైగా ఉంటుంది. అందుకే… ఈవీ కొనే ముందే… కొత్త బ్యాటరీ ధర ఎంత ఉంటుందనే విషయం కచ్చితంగా తెలుసుకోవాలి.

ప్రస్తుతం మార్కెట్లో ఓలా, టాటా ఈవీలకు భారీ డిమాండ్ ఉంది. ఓలా కంపెనీ అందుబాటులోకి తెచ్చిన వివిధ ఈవీ మోడళ్లలో 2, 3, 4 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న బ్యాటరీలు అమర్చుతున్నారు. ఓలా ఈవీల్లోని 4 కిలోవాట్ల బ్యాటరీ ధరే ఏకంగా రూ. 87వేలకు పైగా ఉంది. అదే 3 కిలోవాట్ల బ్యాటరీ ధర చూస్తే రూ.66 వేలకు పైగా ఉంది. ఇక 2 కిలోవాట్ల బ్యాటరీ ధర కూడా రూ.50 వేల దాకా ఉంటుంది. ఇక టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు షోరూం ధర రూ.15 లక్షల నుంచి రూ.17.5 లక్షల మధ్య ఉంది. ఇందులో అమర్చే బ్యాటరీ విలువే ఏకంగా రూ.11 లక్షల దాకా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సో… ఈవీలు కొన్న వినియోగదారులు… వారెంటీ గడువు ముగిశాక కొత్త బ్యాటరీలు కావాలంటే మాత్రం… భారీగా ఖర్చు చేయాల్సిందే.


Subscription Sharges:మస్క్ బాటలో మార్క్

Railways New Service:దిగాల్సిన స్టేషన్ ఇక మిస్ కాదు.. రైల్వే శాఖ కొత్త సర్వీస్..

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×