BigTV English

Gang Rape : మహిళ కిడ్నాప్.. కారులో గ్యాంగ్ రేప్.. హైదరాబాద్‌లో దారుణం..

Gang Rape : మహిళ కిడ్నాప్.. కారులో గ్యాంగ్ రేప్.. హైదరాబాద్‌లో దారుణం..

Gang Rape : పని ఇప్పిస్తామని ఆమెను నమ్మించారు. బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు . దారుణంగా లైంగిక దాడి చేశారు. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.


బతుకుదెరువు కోసం వస్తే..
వికారాబాద్ జిల్లాకు చెందిన ఆ దంపతులు హైదరాబాద్ కు బతుకుదెరువు కోసం వచ్చారు. గండిపేట మండలం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పీరం చెరువు ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.
భర్త కూలీ పనులు చేసుకుంటున్నారు. భార్య గేటెడ్ కమ్యూనిటీలో పనిచేస్తూ కుటుంబ పోషణలో భర్తకు తోడ్పాటు అందిస్తోంది. రోజూ మాదిరిగానే ఫిబ్రవరి 17న పని ముగించుకుని ఇంటి వెళుతోంది. ఇంతలో ఓ వ్యక్తి ఆమెను అనుసరించాడు. తమ దగ్గర పని ఉందని మాయమాటలు చెప్పి ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఫిబ్రవరి 18 తెల్లవారు జామున ఆమెకు ఫోన్ చేసి మాట్లాడాడు.

కిడ్నాప్.. రేప్..
పోలీసులు కథనం ప్రకారం.. ఆమె ఫిబ్రవరి 18న ఉదయం పని కోసం ఇంటి నుంచి బయలు దేరింది. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆమెను కారులో అనుసరించారు. పని ఇప్పిస్తామని మాట్లాడుతూ బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. మత్తుమందు కలిపి డ్రింక్ బలవంతంగా తాగించారు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. కిస్మత్ పూర్, ఓఆర్ఆర్ పై కారులో తిప్పుతూ అసభ్యంగా ప్రవర్తించారు. ఆ తర్వాత నిర్మానుష్య ప్రాంతంలో ఆ ఇద్దరు దుర్మాగులు లైంగికదాడి చేశారు. బాధితురాలి మెడలోని 25 గ్రాముల బంగారు పుస్తెలతాడు లాక్కుని ఆమెను గండిపేట సమీపంలో వదిలి వెళ్లిపోయారు. స్పృహ వచ్చాక ఆమె భర్తకు , మేనమామకు ఫోన్ చేసిన జరిగిన విషయం చెప్పారు. వారు వెళ్లి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.


నిందితుల అరెస్ట్..
సెల్ ఫోన్ నంబర్లు, సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. వారు బాచుపల్లికి చెందిన కారు డ్రైవర్ శుభం శర్మ, ప్రైవేట్ ఉద్యోగి సుమిత్ కుమార్ శర్మ గా నిర్ధారించారు. వారిని అదుపులోకి తీసుకుని కారు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారిలో ఒకరిపై పాత కేసులు ఉన్నట్లు తెలుస్తోంది.

మహిళా కమిషన్ ఆగ్రహం..
వివాహితను కిడ్నాప్‌ చేసి కారులో లైంగికదాడికి పాల్పడిన ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని సైబరాబాద్‌ కమిషనర్‌ను, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి ఆదేశించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు.

Sayanna : ఎమ్మెల్యే సాయన్న పార్థివదేహానికి ప్రముఖులు నివాళులు..

Sridhar : అమితాబ్ బంధువులకు టోకరా.. సంధ్య కన్వెన్షన్‌ ఎండీ శ్రీధర్‌ అరెస్ట్..

Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×