Big Stories

Chain With Gods Images: మెడలో దేవుడి రూప ఉన్న గొలుసు అన్ని వేళల్లా ఉంచుకోవచ్చా….

Chain With Gods Images: మెడలో ఏమాల వేసుకున్నా రాత్రి పూట పడుకునేటప్పుడు తీసి పక్కన పెట్టాలి. ఒక్క మాంగల్యం తప్ప. కొంతమంది ఓపిక లేక వాటిని తీయకుండా అలాగే పడుకుంటున్నారు..జపమాలైనా, రుద్రాక్షాలైనా ,పగడాలైనా ఏదైనా సరే తీయి పక్కన పెట్టాలి. ఉదయం లేచి నిత్యకృత్యాలు చేసిన తర్వాత సాన్నం చేసి వాటిని ధరించాలి. ఏ సమయంలో మనం అపవిత్రంగా ఉంటామో , అపరిశుద్ధంగా ఉంటామో అలాగా అపరిశుద్ధంగా ఉన్న వారిని తాకే అవకాశం ఉందో అలాంటి సమయంలో దేవుడి ప్రతిమలు, చిహ్నాలు ఉండే మాలలు ఒంటిపై ధరించి ఉండకూడదు. తీసి పక్కన పెట్టుకోమని శాస్త్రం చెబుతోంది.

- Advertisement -

నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి. ఏయే సమయంలో అపరిశుద్ధ పనులు చేసేటప్పుడు , అపరిశుద్ధ భావనలు అంటే ఆలోచన కలిగే సమయంలో కూడా వాటిని ధరించకూడదు. ఎందుకంటే అలాంటి వాటిని ధరిస్తే చెడు ఆలోచనలు కలగగూడదనే వాటిని పెట్టుకుంటారు. అలా అయినా కొంతమందైనా మారతారనే ఉద్దేశంతో ఈ నియమాన్ని పెట్టారు. అన్నీ కాకపోయినా కొన్ని చెడ్డపనులైనా మానతారన్న విశ్వాసంతో ఈ పద్ధతిని పెట్టారు. శాస్త్రం ఉద్దేశం ఉత్తమమైన సమాజాన్ని నిర్మించాలనే. ధర్మ సమాజం నిర్మాణం సాగాలనే ప్రతీ ఆచారాన్ని పద్దతిని పెట్టింది.

- Advertisement -

సమాజం బాగుండాలి, ప్రపంచం బాగుండాలి . లోకాలన్నీ బాగుండాలనే శాస్తం కోరుకుంటుంది. పదిమంది యోగ క్షేమాలతో ఉండాలి. ఎవరిలోనే కీడు , చెడ్డ ఆలోచన చేయకూడదు. ఎవరికి హానీ చేయాలన్న ఆలోచన రాకూడదు. అలాంటి ఆలోచనలు వచ్పినప్పుడు మెడలో దండలు తీసి పక్కన పెట్టాలి. అంటే గుర్తు కోసమే. హారం పక్కన పెట్టామంటే అపవిత్రమైన పనికి బోతున్నట్టు గుర్తు. మనశరీరమో, మన మాటో, అటు వైపు వెళ్తుందని సూచన. ఇవన్నీ గుర్తుపెట్టుకుని పరిశుద్దమైన ఆలోచనలు ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి జపమాలలు దేవుడి బొమ్మలు ధరించాలి.

స్త్రీలు అయితే బహిష్టు సమయం కంటే ముందే ఉంగరాలు, లాకెట్లు తీసి భద్ర పరుచుకోవాలి. ఆ సమయంలో ధరించ కూడదు. అంతే కాదు భోజనం చేసేటప్పుడు ఎంగిలి అంటకూడదు. మాంసాహారం భుజించకూడదు. మగ వారు ధూమపానం చేసేటప్పుడు, ఆ పొగ మనం ధరించిన దేవుడి ప్రతిమ కు తగులకూడదు. తెలిసి తెలిసి చేసే తప్పును ఆ భగవంతుడు క్షమించడు. అంతే కాదు మద్యపానం కూడా అంతే….ఇన్ని జాగ్రత్తలు పాటిస్తేనే దేవుడి ప్రతిమ కల ఉంగరాన్ని ధరించాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News