E-Paper
Advertisement

Breathing Problem: శ్వాస తీసుకోవడంలో ఇబ్బందా?.. ఇలా చేయండి

Breathing Problem: శ్వాస తీసుకోవడంలో ఇబ్బందా?.. ఇలా చేయండి
Advertisement

Breathing Problem: ఏదైనా అనారోగ్యంబారిన పడినా, ఇన్ఫెక్షన్‌ వల్ల కూడా శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీంతో ఎంతో అసౌకర్యానికి గురవుతారు. ఒక్కోసారి మెట్లు ఎక్కుతున్నప్పుడు, చలి ఎక్కువగా ఉన్నప్పుడు ,అనారోగ్యం బారిన పడినప్పుడు, అధిక బరువు ఉన్నవారికి కూడా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. కొందరిలో ఈ సమస్య తాత్కాలికంగానే ఉంటుంది. కానీ మరికొందరిలో మాత్రం ఎక్కువవుతుంది. అందువల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించాలి. ఇక ఈ కింద తెలిపిన చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.. అల్లంతో తయారుచేసిన టీ తాగడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి. శ్వాసకోస వ్యవస్థలో ఉండే ఇన్ఫెక్షన్ కూడా చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. అందుకే ఊపిరితిత్తుల్లో ఉండే వాపులు తగ్గుతాయి. అల్లం ముక్కలు నీటిలో వేసి దాంతో డికాషన్ తయారు చేసుకుని తాగితే ఇంకా మంచిది. నేరుగా అల్లం రసాన్ని కూడా తీసుకోవచ్చు. దీంతో శ్వాసకోశ సమస్యలు తగ్గుముఖం పడతాయి. బ్లాక్ టీ తాగడం వల్ల నాసికా రంధ్రాల్లో ఏర్పడిన అడ్డంకులు తొలగిపోతాయి. ఊపిరితిత్తుల్లో ఉండే రంధ్రాలు క్లియర్ అవుతాయి. ఆస్తమా ఉన్నవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఊపిరితిత్తుల పనితీరు బాగుపడుతుంది. శ్వాస తీసుకోవడంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఒక గోడకు శరీరాన్ని ఆనించి నిలబడాలి చేతులను తొడలపై ఉంచాలి. భుజాలను వెనక్కి ఉంచి రిలాక్స్ అవ్వాలి. ఇలా కొద్దిసేపు ఉంటే శ్వాస సరిగా ఆడుతుంది. నేలపై పద్మాసనంలో కూర్చుని వెన్నెముకను నిటారుగా ఉంచాలి. నోటితో గాలిని పిలిచాలి. ఐదు సెకండ్ల పాటు నోట్లోనే గాలిని అలాగే ఉంచాలి. పెదాలను మూసి ముక్కుతో నాలుగు సెకండ్ల పాటు శ్వాసను బయటకు వదలాలి. ఇలా రోజుకి 10 నుంచి 15 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కుర్చీలో కూర్చొని ఉండి రిలాక్స్ అవ్వాలి. ఇలా చేయడం వల్ల కూడా శ్వాసక్రియ మెరుగుపడుతుంది. కుర్చీలో కూర్చొని కాళ్ళను నెలకు ఆనించి ముందుకు వంగాలి. అనంతరం మోచేతులను మోకాళ్లపై ఉంచాలి. చేతులతో గడ్డం పట్టుకుని మెడను భుజాలను ముందుకు వంచి రిలాక్స్ అవ్వాలి. ఇలా చేయడం వల్ల కూడా శ్వాసక్రియ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×