Tamannaah Bhatia: తమన్నా భాటియా పరిచయం అవసరం లేని పేరు. దాదాపు దశాబ్దన్నర కాలం పైగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. తమన్నా(Tamannaah) 15 సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటికి వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలోను అలాగే స్పెషల్ సాంగ్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను తనదైన శైలిలోనే సందడి చేస్తున్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా తమన్నా గురించి తరచూ ఎన్నో రకాల వార్తలు వినపడుతున్నాయి. ఇటీవల కాలంలో తమన్న ఫిట్నెస్ గురించి ఆమె స్లిమ్ గా అవ్వడం గురించి కూడా వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
గత కొద్ది రోజుల క్రితం వరకు తమన్నా అధిక శరీర బరువుతో కనిపించారు . అయితే ఉన్నఫలంగా ఈమె స్లిమ్ లుక్ లోకి మారిపోవడంతో తమన్నా ఉన్నఫలంగా బరువు తగ్గడానికి కారణం ఇంజక్షన్లే అంటూ ఒక వార్త హల్చల్ చేస్తోంది . అధిక శరీర బరువుతో బాధపడుతున్న తమన్నా స్లిమ్ గా కనిపించడం కోసం ఓజెంపిక్(ozempic) అనే ఇంజక్షన్ వాడుతున్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తమన్న ఈ వార్తలపై స్పందిస్తూ అసలు విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ తాను స్లిమ్ అవ్వడానికి ఇంజక్షన్ వాడుతున్నానంటూ వార్తలు వస్తున్నాయి అయితే ఈ వార్తలలో నిజం లేదని దయచేసి ఇంకోసారి ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దని కోరారు.
నా విషయంలో దాచడానికి ఏమీ లేదు 15 సంవత్సరాల వయసులోని కెమెరా ముందుకు వచ్చాను. ఇండస్ట్రీలో నా ఎదుగుదల మీరు చూస్తూనే ఉన్నారు. కెరియర్ మొదట్లో ఎలాగ ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నానని, 20 సంవత్సరాల వయసు నుంచి నేను చాలా సన్నగానే ఉన్నాను అయితే సహజంగానే ఉన్నాను తప్ప ఇంజక్షన్లు వాడి కాదని క్లారిటీ ఇచ్చారు. సాధారణంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మహిళలలో మార్పులు వస్తాయి అలాగే ప్రతి నెల రుతు చక్ర సమయంలో కూడా మార్పులు సంభవిస్తాయని ఇందుకు నేనేమీ అతీతం కాదని తెలిపారు.
ఒత్తిడికి గురి అయ్యాను..
కరోనా కారణంగా తన శరీరంలో కొన్ని మార్పులువచ్చాయి. ఒత్తిడికి గురి కావడంతో కాస్త బరువు పెరిగాను. అయితే బరువు తగ్గడం కోసం కాస్త వ్యాయామాలు చేస్తూ నా శరీరంపై నేను దృష్టి పెట్టానే తప్ప ఇంజక్షన్లు వాడి కాదని ఈమె ఈ వార్తలపై స్పందిస్తూ క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తలకు పూర్తిగా చెక్ పెట్టినట్టు అయింది. ఇక తమన్నా కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె పలు సినిమాలలో నటిస్తూనే మరోవైపు స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక చివరిగా తెలుగులో ఈమె చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ సినిమాలో కనిపించారు. ఈ సినిమా అనంతరం ఇప్పటివరకు తదుపరి తెలుగు సినిమాలను తమన్న ప్రకటించలేదు.