Hero Dharmendra:బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరు సొంతం చేసుకున్న ధర్మేంద్ర (Dharmendra)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 1935 డిసెంబర్ 8 జన్మించిన ఈయన అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్.. పంజాబ్ లోని లుత్యానా జిల్లాలో ఉన్న నస్రలీ అనే గ్రామంలో కేవల్ కిషన్ సింగ్ డియోల్, సత్వంత్ కౌర్ దంపతులకు జన్మించారు. ఈయన తండ్రి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు. ధర్మేంద్ర 1952లో వచ్చిన ఫగ్వారాలో రాంగర్హియా కాలేజీలో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు.
ఇకపోతే నటుడిగా 1960లో ఇండస్ట్రీకి అరంగేట్రం చేశారు ధర్మేంద్ర. అర్జున్ హింగోరాణి దర్శకత్వం వహించిన దిల్ భీ తేరా హమ్ భీ తేరా అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన ధర్మేంద్ర.. 1967 మధ్య ఆయన నటించిన చిత్రాలతో రొమాంటిక్ హీరోగా పేరు దక్కించుకున్నారు. తర్వాత రొమాంటిక్ హీరో గానే కాకుండా యాక్షన్ చిత్రాలతో కూడా ప్రేక్షకులను అలరించిన ఈయన.. బాలీవుడ్ లో ఎక్కువగా చిత్రాలు చేసిన ఈయన హిందీ సినీ పరిశ్రమకు చేసిన సేవకు గాను ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం కూడా అందుకున్నారు.
ఇకపోతే ఎక్కువగా యాక్షన్ సినిమాలలో నటించిన ధర్మేంద్రను ఆయన అభిమానులు యాక్షన్ కింగ్, హీ -మ్యాన్ వంటి బిరుదులను కూడా అందించారు. 1975లో వచ్చిన షోలే చిత్రం ఆయన కెరియర్లో అతిపెద్ద మలుపుగా మారిపోయింది. ఇకపోతే ఇలా నటుడుగానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా పేరు దక్కించుకున్నారు. రాజస్థాన్లోని బికనీర్ నుంచి భారతీయ జనతా పార్టీ నుండి అభ్యర్థిగా లోకసభకు ఎన్నికైన ఈయన 2012లో భారత ప్రభుత్వం చేత పద్మభూషణ్ అవార్డును కూడా అందుకున్నారు. అలా తన చిత్రాలతో అభిమానుల చేత భారీ పాపులారిటీ దక్కించుకొని నేడు బాలీవుడ్ లెజెండ్రీ నటుడిగా పేరు సొంతం చేసుకున్నారు.
ALSO READ:Hero Dharmendra: చనిపోకముందే చంపేశారు.. ధర్మేంద్రకు ఇది మొదటిసారి కాదు
ఇకపోతే బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లెజెండ్రీ నటుడిగా ధర్మేంద్ర ఎంత పేరైతే సొంతం చేసుకున్నారో.. ఆయన వారసులు బాబీ డియోల్(Bobby Deol), సన్నీ డియోలు(Sunny Deol) కూడా అంతే పేరు దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ముందుగా బాబీ డియోల్ విషయానికి వస్తే.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టిన ఈయన ఆ తర్వాత నటుడిగా మారారు. మొదటి సినిమాతోనే ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్న ఈయన.. బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాబి డియోల్ ఆ తర్వాత ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – జ్యోతి కృష్ణ కాంబినేషన్లో వచ్చిన హరిహర వీరమల్లు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు బాబి డియోల్. అటు ఈయన సోదరుడు సన్నీ డియోల్, అహనా డియోల్ , సోదరి ఈషా డియోల్ వీరంతా కూడా వారి వారి టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయారు.