Rashmika -Vijay Devarakonda: నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna)తాజాగా ది గర్ల్ ఫ్రెండ్ (The Girl Friend)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నటుడు రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) దర్శకత్వంలో రష్మిక, దీక్షిత్ శెట్టి(Deekshith Shetty) ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా నవంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుకొని మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం నవంబర్ 12వ తేదీ సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)హాజరు కాబోతున్నారని తెలుస్తోంది.
ఇలా రష్మిక సినిమా కోసం విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా రాబోతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం మరింత స్పెషల్ గా మారిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా వీరిద్దరి నిశ్చితార్థం(Engagment) తర్వాత మొదటిసారి ఇద్దరూ ఒకే వేదికపై కనిపించబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రష్మిక విజయ్ దేవరకొండ ఇటీవల కలిసి ఎన్నో కార్యక్రమాలలో సందడి చేశారు కానీ నిశ్చితార్థం తర్వాత జంటగా ఎక్కడ కలిసి కనిపించలేదు. ఈ క్రమంలోనే ది గర్ల్ ఫ్రెండ్ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ రాబోతున్నారని తెలుస్తోంది.
నిజానికి విజయ్ దేవరకొండను ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకే తీసుకువస్తానని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాలవల్ల ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు రష్మిక హాజరు కాలేకపోయారు. ఈ కార్యక్రమానికి రష్మికనే హాజరు కానప్పుడు ఇక విజయ్ దేవరకొండను ఎలా తీసుకురాను అంటూ అల్లు అరవింద్ సరదాగా కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఇలా విజయ్ దేవరకొండ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరు కాకపోయినా సక్సెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.
వచ్చే ఏడాది వివాహం..
ఇక విజయ్ దేవరకొండ రష్మిక గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇలా రిలేషన్ లో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో చాలా సింపుల్ గా నిశ్చితార్థం జరుపుకున్నారు. ఇక వీరి వివాహం 2026 ఫిబ్రవరిలో జరగబోతుందని వార్తలు బయటకు వచ్చాయి కానీ ఇప్పటివరకు నిశ్చితార్థం గురించి పెళ్లి గురించి రష్మిక లేదా విజయ్ దేవరకొండ ఎక్కడ అధికారకంగా స్పందించలేదు. అయితే వీరిద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారని వీరి వివాహం ఉదయపూర్ ప్యాలెస్ లో జరగబోతోంది అంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఇక రష్మిక కూడా తన పెళ్లి పనులలో బిజీగా గడుపుతున్నట్టు సమాచారం. ఇలా ఒకవైపు వరుస సినిమాల షూటింగ్ పనులలో పాల్గొంటూ బిజీగా ఉన్న ఈ జంట మరో వైపు పెళ్లి పనులలో కూడా ఎంతో బిజీబిజీగా గడుపుతున్నారు.
Also Read: Tamannaah Bhatia: స్లిమ్ గా కనిపించడం కోసం ఇంజక్షన్స్.. తమన్నా గ్లామర్ సీక్రెట్ ఇదేనా?