BigTV English

Two Kitchens:-ఒకే ఇంట్లో రెండు వంట గ‌దులు ఉండ‌వ‌చ్చా?

Two Kitchens:-ఒకే ఇంట్లో రెండు వంట గ‌దులు ఉండ‌వ‌చ్చా?

Two Kitchens:- ఒకో ఇంట్లో ఉన్న అన్న‌ద‌మ్ములు వేరుప‌డితే రెండో కిచెన్ ఎక్క‌డ క‌ట్టుకోవాలన్న సందేహాలున్నాయి. అసలు ఇంట్లో రెండు వంటగదులు పెట్టుకోవచ్చా…అనే వారికి సమాధానం ఇది. నిజానికి కిచెన్‌ ఒక్కటే ఉండాలి. ఒక కప్పుకింద రెండు పొయ్యిలు మంచిది కాదని మన పెద్దలు ఏనాడో చెప్పారు. సమష్టి కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని వాళ్లు అలా చెప్పారు. కుటుంబాల్లో విభేదాలు రాకుండా ఉండటానికి ఇలా నియమం పెట్టి ఉండొచ్చు.


వంటగదిని ఈమధ్య ఫ్యాషన్‌గా మార్చేశారు. చూపించడానికి ఒకటి, వండుకోవడానికి ఒకటి కట్టేస్తున్నారు. ఆగ్నేయంలో ఒక వంటగది వచ్చాక, రెండోది ఎక్కడ పెడతారు? ఒకవేళ నిర్మించినా, అది ఆగ్నేయంలో కాకుండా దక్షిణానికి కానీ, తూర్పునకు కానీ విస్తరించి ఉంటుంది. ఇది శాస్త్రపరంగా దోషం. అన్నదమ్ములు వేరు పడితే, ఇంటి పైపోర్షన్‌లో ఆగ్నేయంలో కిచెన్‌ పెట్టుకోవచ్చని సూచిస్తున్నారు. ఒకే అంతస్తు ఉన్నట్లయితే ఇంటిని రెండు భాగాలు చేసినప్పుడు రెండు కిచెన్‌లు పెట్టుకోవచ్చు.

యజమాని ఒక్కరే అయితే మాత్రం రెండు వంట గదులు ఉండకూడదు.. ఆరోగ్యం సంపదకి వాస్తు శాస్త్రం కొన్ని సూచనలు చేసింది. ఇంటి శక్తిని శుద్ధి చేసే పొయ్యి , అందువల్ల అక్కడ వండిన ఆహారం శరీరానికి పోషకాహారం అందించే అగ్నిని ఖచ్చితమైన దిశలో ఉంచాలి. వంటశాలలు ఈశాన్య , నైరుతిలో ఉండకూడదని శాస్త్రం చెబుతోంది. వాస్తు ప్రకారం, అగ్ని వనరుల స్థానం ఆగ్నేయ దిశలో ఉండాలి. వంటగది ఆగ్నేయ మూలలో ఉండాలి. వంట చేసేటప్పుడు తూర్పు వైపు ముఖం ఉండాలి.


వంటగది మాత్రమే కాదు, వాస్తు శాస్త్రం ప్రకారం భోజన ప్రాంతం కూడా చేయాలి. డైనింగ్ టేబుల్ పై అంతస్తులో ఉన్న టాయిలెట్ క్రింద ఉండకూడదు. డైనింగ్ టేబుల్స్ చదరపు లేదా దీర్ఘచతురస్ర ఆకారంలోమాత్రమే ఉండాలి. వంటగదికి వాడే రంగులు కూడా ఆకుపచ్చ, నిమ్మ పసుపు, నారింజ కలర్స్ మాత్రమే వాడటం మంచిది.

ఈ ఏడాదిలో పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు
for more updates follow this link:-bigtv

Related News

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Big Stories

×