BigTV English

God Photos: గదికో దేవుడి ఫోటోను పెట్టుకోవచ్చా…?

God Photos:  గదికో దేవుడి ఫోటోను పెట్టుకోవచ్చా…?

God Photos : ఏ గదిలో ఏ దేవుడి ఫోటో పెట్టుకోవాలో పురాణజ్ఞానం కొన్ని విషయాలు చెబుతోంది. అసలు దేవుడ్ని చూడకుండా బొమ్మలు ఎలా గీసారో అని సందేహాలు రావచ్చు.. ప్రముఖ చిత్రకారుడు రవి వర్మ లాంటి వాళ్లు ఎన్నో పురాణాలు చదివి ఆకళింపు చేసుకుని మనస్సులో దేవుడ్ని స్మరించుకుంటూ దేవుడి పటాల్ని చిత్రించేవార. ఇప్పుడు మనం చూస్తున్న పటాల్లో ఎక్కువ రవి వర్మ కుంచె నుంచి జాలువారినవేనట.


ఇక దేవుడి పటాల విషయానికి వస్తే ప్రతీ గదిలో దేవుడి ఫోటోలు పెట్టుకోవచ్చా అన్న సందేహాలు వస్తుంటాయి. ఒక వేళ పెట్టుకుంటే ఏ గదిలో ఏదేవుడ్ని పటాన్ని పెట్టుకోవచ్చలో పెద్దలు మనకు రకరకాల మార్గాల ద్వారా చెప్పారు. దేవుడి గదిలోనే కాదు ఇతర గదుల్లో దేవుడి పటాల్ని పెట్టుకోవచ్చు. అతిథిలు కూర్చునే గదుల్లో శ్రీ సీతారామచంద్రమూర్తి పరివారం ఫోటోను పెట్టుకోవడం శ్రేయస్కరం. సీతారాములతోపాటు లక్ష్మణుడు, ఆంజనేయుడు, భరతుడు, శత్రుఘ్నుడితో ఉన్న రామ్ దర్బార్ ఫోటోను డ్రాయింగ్ రూంలో పెట్టుకుంటే ఉత్తమ ఫలితాలు వస్తాయి. సీతారామ కుటుంబంతోపాటు పార్వతి పరమేశ్వరుడు, విఘ్వేశ్వరుడు, కుమారస్వామి , నంది, సింహం ఉన్న శివుడి కుటుంబాన్ని కూడా పెట్టుకోవచ్చు.

స్టడీ రూం విషయానికి వస్తే ప్రసన్నాంజనేయుడు, ధ్యాన ఆంజనేయుడి ఫోటోలు , దక్షిణామూర్తి, సరస్వతిదేవి మాత ఫోటోలను ఏర్పాటు చేసుకోవాలి. బెడ్ రూం విషయానికి వస్తే రుక్మిణి దేవి శ్రీకృష్ణుడి సహిత ఫోటోను పెట్టుకోవాలి. లక్ష్మీనరసింహస్వామి కులదైవంగా పూజించే వారు పూజ గదిలో మాత్రమే ఆ ఫోటోను ఏర్పాటు చేసుకోవాలి.మెయిన్ డోర్ పైన బయటి నుంచి చూడగానే కనిపించే స్థానంలో గణపతి ఫోటోను ఏర్పాటు చేసుకోవచ్చు. వంట గది గోడపైన అన్నపూర్ణాదేవి ఫోటోను పెట్టుకుంటే ఆ ఇంట్లో ఏనాడు అన్నానికి లోటు ఉండదు. అతిథులతో పంక్తి భోజనాలు ఇల్లు నిత్యం కళకళలాడుతుంది. శాస్త్రం ప్రకారం 8 రకాల పటాలను మాత్రమే ఇంట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది.


Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×