BigTV English
Advertisement

Chameleon : ఊసరవెల్లి రంగును ఎలా మారుస్తుందో తెలుసా..!

Chameleon : ఊసరవెల్లి రంగును ఎలా మారుస్తుందో తెలుసా..!

Chameleon : మనం చాలా రకాల జంతువుల్ని చూస్తూ ఉంటాం. అయితే కొన్ని జంతువులు చూడటానికి ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అటువంటి జంతువుల్లో ఊసరవెల్లి ఒకటి. ఊసరవెల్లి ఎప్పటికప్పుడు దాని రంగును మారుస్తూ ఉంటుంది. అందుకే మనుషులు దాని స్వభావానికి అనుగుణంగా రకరకాల సామెతలు సృష్టించారు. అయితే ఊసరవెల్లి దాని రంగును ఎందుకు మారుస్తుందో మీకు తెలుసా..?


ఊసరవెల్లి శరీరానికి ఫోటోనిక్ క్రిస్టల్ అనే పొర ఉంటుంది. ఈ పొర పర్యావరణానికి అనుగుణంగా రంగును మార్చడానికి ఊసరవెల్లికి సహాయపడుతుంది. నిజానికి ఈ పొర కాంతి ప్రతిబింబాన్ని ప్రభావితం చేస్తుంది. చెప్పాలంటే ఊసరవెల్లి ఉత్సాహంతో ఉన్నప్పుడు ఫోటోనిక్ క్రిస్టల్ పొర వదులుగా మారుతుంది. ఇలా వదులుగా మారినప్పుడు ఊసరవెల్లి ఎరుపు లేదా పసుపు రంగులోకి మారుతుంది. ఊసరవెల్లికి అదనంగా స్పటికాలతో కూడిన మరొకపొర ఉంటుంది. ఈ పొర దానిని వేడి నుంచి రక్షిస్తుంది.

సహజంగా ఊసరవెల్లి తనపై అటాక్ చేయాలనుకున్న జీవుల దృష్టిని మరల్చడానికి రంగు మార్చుకుంటుంది. ఊసరవెల్లిలను వేటాడే సమయంలో గమనించినట్లయితే ఎక్కువ సార్లు మారుస్తుంది. దీని ద్వారా ఊసరవెల్లి వేటాడాలనుకున్న జీవిని మాయచేసి పట్టుకుంటాయి. ఊసరవెల్లి రంగు మార్చడానికి భద్రత, వేట విషయంలోనూ ఉపయోగిస్తాయి.


శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం.. ఊసరవెల్లి తన భావాలకు అనుగుణంగా రంగును మారుస్తుంది. అది ఇతర జాతుల జంతువులతో మాట్లాడటానికి లేదా దాని మానసిక స్థితిని చెప్పడానికి రంగును మారుస్తుంది. ఊసరవెల్లి రంగును మార్చడంతోపాటు ప్రమాద సమయంలో వాటి ఆకారాన్ని కూడా మారుస్తాయి. అవసరమైతే వాటి పరిణామాన్ని పెంచుకోవడం, తగ్గించుకోవడం కూడా చేస్తాయని పరిశోధనలో తేలింది.

Tags

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×