BigTV English

Computers vs Humans Brain : కంప్యూటర్లకు జ్ఞానం.. అచ్చం మనిషిలాగా..

Computers vs Humans Brain : కంప్యూటర్లకు జ్ఞానం.. అచ్చం మనిషిలాగా..
Computers vs Humans Brain

Computers vs Humans Brain : ఒక్కొక్కసారి మనిషి మెదడు కంటే కంప్యూటర్ బ్రెయినే మెరుగైనదని చాలామంది అంటుంటారు. అది కొన్ని సందర్భాల్లో నిజమే అని నిపుణులు సైతం ఒప్పుకుంటారు. కానీ ఈమధ్య కాలంలో మనిషి మెదడు అనేది పూర్తిగా కంప్యూటర్ బ్రెయిన్‌పై ఆధారపడింది. అందుకే కంప్యూటర్ బ్రెయిన్‌కు కూడా ఆలోచనా శక్తి అనేది అందిస్తే.. ఎలా ఉంటుంది? అనే ఆలోచన శాస్త్రవేత్తలకు వచ్చింది. ప్రస్తుతం ఈ కోణంలో పరిశోధనలు కూడా మొదలయ్యాయి.


మనిషి మెదడు అనేది ఒక సందర్భం గురించి ఒక రకంగా మాత్రమే కాకుండా వెయ్యి రకాలుగా ఆలోచిస్తుంది. దీనికి కారణం దానికి ఆలోచించే శక్తి ఉడడమే. కంప్యూటర్ అలా కాదు.. కేవలం మనిషి చెప్పిందే చేస్తుంది, మనిషి సందేహాలకు సమాధానాలు ఇస్తుంది. కానీ దానంతట అది ఆలోచించలేదు, నిర్ణయాలు తీసుకోలేదు. అందుకే మనిషి ఆలోచన శక్తిని కంప్యూటర్‌లకు కూడా అందించాలని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. అందుకోసమే బయో కంప్యూటర్ల తయారీని చేపట్టారు. కేవలం బయో కంప్యూటర్లకు మాత్రమే కాకుండా ఇతర కంప్యూటర్లకు కూడా ఆలోచన శక్తిని ఇవ్వాలనే దిశలో ప్రస్తుతం వారి అడుగులు పడుతున్నాయి.

ఈ ఏడాది ముగిసేలోపు కంప్యూటర్ల బ్రెయిన్‌లో కూడా తెలివి, జ్ఞానం అనేది అందిస్తామని శాస్త్రవేత్తలు కచ్చితంగా చెప్తున్నారు. పర్యావరణాన్ని బట్టి ఎలా ప్రవర్తించాలో ఇకపై కంప్యూటర్లకు కూడా తెలుస్తుందని వారు అంటున్నారు. మనుషులలాగానే కంప్యూటర్లు కూడా ప్రవర్తిస్తాయని చెప్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ), చాట్ జీపీటీ వంటి ఎన్నో టెక్నాలజీల తయారీలో పనిచేసిన శాస్త్రవేత్తలు కంప్యూటర్లకు తెలివిని అందించే పరిశోధనల్లో పాల్గొంటున్నారు. అందుకే వారు ఇది సాధ్యమవుతుందని కచ్చితంగా చెప్తున్నారు.


ఇప్పటికే ఎంతోమంది శాస్త్రవేత్తలు కంప్యూటర్లకు మనిషిలాగా ఆలోచించే తెలివిని అందించాలని ప్రయత్నాలు చేశారు. కానీ అవేవి పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేదు. ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందడం వల్ల దీని సాయంతో ఎలాగైనా వారు అనుకున్నది సాధించాలని భావిస్తున్నారు. కంప్యూటర్లు మనిషిలాగా ఆలోచించడం మొదలుపెడితే.. మనుషులకు మంచి స్నేహితులు అవుతాయని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం ఎప్పటికైనా అది ప్రమాదకరమే అని హెచ్చరిస్తున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×