BigTV English

Daily Astrology : నేటి రాశిఫలాలు.. వీరు స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి..!

Daily Astrology : రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు . వాటి అనుగుణంగానే రోజును ప్లాన్‌ చేసుకుంటుంటారు. అటువంటి వారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Daily Astrology : నేటి రాశిఫలాలు.. వీరు స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి..!

Daily Astrology : రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు . వాటి అనుగుణంగానే రోజును ప్లాన్‌ చేసుకుంటుంటారు. అటువంటి వారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.


శ్రీశుభకృతు నామ సంవత్సరం పుష్య మాసం. వారపు రోజు మంగళవారం. తిథి : త్రయోదశి రా. 8:39వరకు. నక్షత్రం : ఆరుద్ర పూర్తి వరకు. కరణం : కౌలవ ఉ.8:54 వరకు. యోగం : ఇంద్ర ఉ.9:15 వరకు తదుపరి వైధృతి. సూర్యసమయం : సూర్యోదయము – ఉ. 6:38. సూర్యాస్తమానము – సా. 5:46. దుర్ముహూర్తం : ఉ .8.55 – 9.41,రా .11.03-11.54. వర్జ్యం : మ. 1.53-3.35. శుభ సమయం : అభిజిత్ ముహుర్తాలు – 12:04 – 12:49. అమృతకాలము : లేదు.

మేష రాశి : ఈ రాశివారికి విదేశీయోగం ఉంది. విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంది. . ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు.అనారోగ్య సమస్యలు అధికమవుతాయి.
ముఖ్యమైన వ్యక్తులను కలిసే అవకాశం ఉంది.


వృషభ రాశి : ఈ రాశి వారి రుణ ప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. క్షణికావేశంతో ప్రమాదం ఉంది. అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి మంచిది.

మిధున రాశి : ఈ రాశి వారు మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ప్రయత్న కార్యాలు ఆలస్యమవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండాలి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది.

కర్కాటక రాశి : ఈ రాశి వారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల లాభాన్ని ఇస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. ధనచింత ఉండదు. . అన్నివిధాలా సుఖాన్ని పొందుతారు.సమాజంలో గౌరవమర్యాదలు లభిస్తాయి.

సింహ రాశి : ఈ రాశి వారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనంగా ఉండటం అన్నివిధాలా మేలు. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తపడి. అనవసరంగా రుణప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. అనారోగ్యంలో బాధపడతారు.

కన్య రాశి : ఈ రాశి వారు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవాలి. మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు.పిల్లలపట్ల మిక్కిలి జాగ్రత్తగా ఉండాలి. సోమరితనం ఆవహిస్తుంది. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో మార్పు ఉండదు.

తులా రాశి : ఈ రాశి వారి ముఖ్యమైన వ్యక్తులను కలుసే అవకాశం ఉంది. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణప్రయత్నాలు ఫలించవు. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. . రహస్య శతృబాధలు ఉండే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడే ప్రమాదం ఉంది

వృశ్చిక రాశి : ఈ రాశి వారు ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడతుంది. అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువగా ఖర్చువుతుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటుంది.

ధనుస్సు రాశి : ఈ రాశి వారు మనస్సు చంచలంగా ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడే ప్రమాదం ఉంది. అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశంద. చెడు సహవాసానికి దూరంగా ఉండాలి.

మకర రాశి : ఈ రాశి వారు గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాలి .

కుంభ రాశి : ఈ రాశి వారు బంధు, మిత్రులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో మిక్కిలి శ్రద్ధ ఉండాలి. శారీరక శ్రమతోపాటు మానసిక ఆందోళన తప్పదు. చిన్న విషయాలకోసం ఎక్కువ శ్రమిస్తారు.

మీన రాశి : ఈ రాశి వారు అపకీర్తి రాకుండా జాగ్రత్త పడాలి. ప్రయాణాల్లో వ్యయ, ప్రయాసలు తప్పవు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. కలహాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. దూరపు వ్యక్తులు పరిచయం అవుతారు.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×