BigTV English

Dakshinamurthy :- దక్షిణామూర్తిని పూజిస్తే ఆ బాధల నుంచి విముక్తి

Dakshinamurthy :- దక్షిణామూర్తిని పూజిస్తే ఆ బాధల నుంచి విముక్తి

Dakshinamurthy :- మనకు జ్ఞానాన్ని ప్రసాదించే శివ జ్ఞాన స్వరూపుడు మేథా దక్షిణామూర్తి. అన్ని విద్యలకూ మూలం శ్రీ దక్షిణా మూర్తి. దక్షిణామూర్తిని పూజిస్తే గురు గ్రహ అనుగ్రహాన్ని పొందవచ్చు. దక్షిణామూర్తిని ఆరాధనతో అజ్ఞానపు పొరలు తొలగిపోతాయి. దక్షిణామూర్తి రూపాన్ని పరిశీలిస్తే ఒక కాలుతో రాక్షసుణ్ణి తొక్కి పెట్టినట్టు ఉంటుంది. ఆ కిందే రుషులు ఆశీసునులై ఉంటారు. ఎంతో ప్రశాంతంగా కనిపించే స్వామి కుడివైపు చెవికి నాగాభరణం , ఎడమవైపు చెవికి జగన్మాత కర్ణాభరణంతో దర్శనమిస్తారు.


శివాలయాలకి వెళ్లే వారు దక్షిణ దిక్కులో ఉండే దక్షిణామూర్తిని పూజించడం మంచిది. అపమృత్యు భయాన్ని తొలగించే విధంగా స్వామి అర్ధనారీశ్వర రూపం ఉంటుంది. స్వామికి ఎదురుగా ధ్యానించడం వల్ల మృత్యు భయం దూరమవుతుంది. దక్షిణామూర్తి స్తోత్రం పటిస్తే గురు గ్రహ బలం మెరుగపడుతుంది . దేశవ్యాప్తంగా జ్ఞానస్వరూపుడైన ఉన్న ఆలయాలు వేల సంఖ్యలోఉన్నాయి. కానీ పరమశివుడి దక్షిణామూర్తి అవతారం విగ్రహరూపంలో ఉన్న ఆలయం హైదరాబాద్ లో మాత్రమే ఉంది.


మంచి విద్యాబుద్ధులు కోసం దక్షిణామూర్తిని నిత్యం పూజించాలి. పునర్జన లేకుండా ఆశీర్వదించే దేవుడు కూడా దక్షిణామూర్తే. స్వామిని భక్తితో కొలిచే వారికి ఐశ్వర్యం కలుగుతుంది.రోజుకి కనీసం పది నిమిషాలైన స్త్రోతాన్ని జపించినా చాలు విశేషమైన ఫలితాలు వస్తాయి. అన్ని వయసులు వారికి ఈ పని ఆచరించవచ్చు. భక్తులో మంచి ఆలోచనలు కలిగిస్తాడు స్వామి. ఇంట్లో అనారోగ్యంతో ఉన్న పెద్దవాళ్లు ప్రతీ రోజు దక్షిణామూర్తి చూస్తే అప మృత్యువు ఉండదు. దక్షిణామూర్తి అయ్యరూపంతోనే కాదు అమ్మమూర్తి కూడా అని లలితాసహస్రంలోనే ఉదహరించారు.

Related News

Chanakya Niti: చాణక్య నీతి: కుటుంబ పెద్ద ఆ ఒక్క పని చేస్తే చాలు – ఆ ఇల్లు బంగారంతో నిండిపోతుందట

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Big Stories

×