Big Screen Iphone Discount| ప్రస్తుతం ఐఫోన్ 17 సిరీస్ మోడల్స్ మార్కెట్లో హాట్ కేకుల్లా సేల్ అవుతున్నాయి. అయినా ఐఫోన్ 16, ఐఫోన్ 15 మోడల్స్ కు ఇంకా డిమాండ్ తగ్గలేదు. ఇప్పటికీ ఈ పాత వెర్షన్లు కొనుగోలు చేసే డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఐఫోన్ 16 సిరీస్ కు విపరీతమైన ఆర్డర్స్ వస్తుండగా.. ఐఫోన్ 15 సిరీస్‌లో స్పెషల్ అయిన ఐఫోన్ 15 ప్లస్ లో మిగతా ఏ ఐఫోన్ లో లేని ప్రత్యేకమైన ఒక ఫీచర్ ఉంది. అదే అతిపెద్ద స్క్రీన్.
ఐఫోన్ 15 ప్లస్ ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ కొనడానికి ఇదే బెస్ట్ టైమ్. పెద్ద స్క్రీన్ ఉన్న ఈ ఆపిల్ ఫోన్ చాలా తక్కువ ధరకు దొరుకుతోంది. మీరు డబ్బు బాగా ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్ రిలయన్స్ డిజిటల్‌లో లైవ్‌గా ఉంది.
128GB వేరియంట్ ధర రూ.50,900కి లిస్ట్ అయింది. ఇది ఇప్పటికే పెద్ద ధర తగ్గింపు. ఇంకా ఎక్కువ సేవింగ్స్ చేయడానికి బ్యాంక్ ఆఫర్ ఉంది. ఐడీబీఐ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే.. 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందండి. దీంతో మరో రూ.4,000 వరకు ఆదా చేయగలరు.
చివరికి ఫోన్ ధర రూ.46,900 అవుతుంది. అంటే రూ.89,900కి లాంచ్ అయిన ఈ ఐఫోన్ పై మీరు రూ.43,000 వరకు ఆదా చేస్తున్నారు. పెద్ద స్క్రీన్ ఐఫోన్ కావాలనుకునే వారికి ఇది అద్భుతమైన డీల్.
ఫోన్‌లో 6.7 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉంది. ఈ స్క్రీన్ అద్భుతమైన కలర్స్, లోతైన నలుపు ఇస్తుంది. రిజల్యూషన్ 1290×2796 పిక్సెల్స్. పిక్సెల్ డెన్సిటీ 460 పీపీఐ, చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పీక్ బ్రైట్‌నెస్ 2000 నిట్స్. ఎండలో కూడా బాగా కనిపిస్తుంది. ఐపీ68 రేటింగ్ ఉంది. ఇది పూర్తిగా దుమ్ము, నీటి నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది.
ఐఫోన్ 15 ప్లస్‌లో ఏ16 బయోనిక్ చిప్ ప్రాసెసర్ ఉంది. ఈ హెక్సా-కోర్ ప్రాసెసర్ స్మూత్ పనితీరు ఇస్తుంది. అన్ని యాప్స్, గేమ్స్ సులభంగా రన్ అవుతాయి. ఫోన్ లేటెస్ట్ ఐఓఎస్ 18పై రన్ అవుతుంది.
వెనుక కెమెరా సిస్టమ్‌లో రెండు సెన్సార్లు ఉన్నాయి. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్స్ వైడ్-యాంగిల్. ఎఫ్/1.6 అపర్చర్ ఉంది. తక్కువ లైట్‌లో కూడా ఫోటోలు బాగా వస్తాయి. రెండో కెమెరా 12ఎంపీ అల్ట్రా-వైడ్. ఎక్కువ ఫ్రేమ్ క్యాచర్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా 12 మెగాపిక్సెల్స్. సెల్ఫీలు లేదా వీడియో కాల్స్‌కి బెస్ట్.
ఫోన్‌లో లేటెస్ట్ కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. డ్యూయల్ సిమ్ సపోర్ట్ 4జీ 5జీ, బ్లూటూత్, జీపీఎస్, ఎన్‌ఎఫ్‌సీ పేమెంట్స్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్. వై-ఫై ద్వారా ఇంటర్నెట్ ఫాస్ట్ గా ఉంటుంది. ఫోన్ లో బోలెడు సెన్సార్లు ఉన్నాయి. యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, బారోమీటర్, కంపాస్/మాగ్నెటోమీటర్ ఇవన్నీ పవర్ సెన్సార్లు.
ఐఫోన్ 15 ప్లస్ ఇప్పుడు తప్పనిసరి డీల్. సగం ధరలో ప్రీమియం ఆపిల్ అనుభవం. పెద్ద డిస్‌ప్లే మీడియా చూడడానికి బెస్ట్. పవర్‌ఫుల్ చిప్ సంవత్సరాల తరబడి పని చేస్తుంది. ప్రస్తుతం రిలయన్స్ ఆఫర్ తో భారీ సేవింగ్స్ చేసుకోండి ఈ స్పెషల్ ఆఫర్ మిస్ చేయవద్దు.
Also Read: ఆస్పత్రిలో రూ.1.6 కోటి బిల్లు చూసి షాకైన యువకుడు.. అసలు బిల్లు రూ.29 లక్షలే.. మోసం ఎలా కనిపెట్టాడంటే