Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ ఓటర్ల తీరు మారనట్టు కనిపిస్తోంది. ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి 11 గంటల సమయానికి 20.76శాతం నమోదైంది గత ఎన్నికల్లో ఇక్కడ కేవలం 47 శాతం పోలింగే నమోదైంది. ఈ ఉప ఎన్నికల్లో అయినా పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందని భావిస్తే… అలాంటి సీన్ ఏమీ కనిపించడం లేదు. పోలింగ్ ఇప్పటికీ మందకొడిగానే సాగుతోంది. ఏ పోలింగ్ బూత్ దగ్గరా క్యూ లైన్లు లేవు.
పోలింగ్ కేంద్రాలకు వస్తున్న వారిలో వృద్ధులే ఎక్కువ ఉంటున్నారు. మిడిల్ ఏజ్డ్, యూత్ ఓటర్లు పెద్దగా కనిపించడం లేదు. చాలా పోలింగ్ కేంద్రాలు ఖాళీగానే ఉన్నాయి. వస్తే 10 నిమిషాల్లోనే ఓటేసి వెళ్లిపోయే అవకాశం ఉంది. కానీ.. ఓటర్లు పెద్దగా కనిపించడం లేదు. ఓటింగ్ అంటే అంత నిర్లక్ష్యం ఎందుకు? మీ ఎమ్మెల్యేను ఎన్నుకునే బాధ్యత మీకు లేదా?
ఓటు వేయకపోతే మీకు ప్రశ్నించే హక్కు ఉంటుందా? ఓటు వేయడానికి అరగంట టైమ్ కేటాయించలేకపోతున్నారా? ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం మన బాధ్యత అని మర్చిపోతున్నారా? ఇంట్లో కూర్చుని టీవీలో సినిమా చూసే బదులు.. పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటు వేయొచ్చు కదా! ఇన్ స్టా రీల్స్ చేయడానికి కేటాయించే టైమ్‌లో.. కనీసం అరగంట ఓటు వేయడానికి కేటాయించలేరా? ఓటు వేయనపుడు మీకు ఓటు హక్కు ఎందుకు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎన్నికల అధికారులు మాత్రం ఓటు వేసేందుకు ఓటర్లంతా రావాలని కోరుతున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఉదయం 11 గంటల వరకు 20.76 శాతం పోలింగ్
తొలి 4 గంటల్లో 20.76 శాతం పోలింగ్ నమోదు
కొనసాగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్
మందకొడిగా సాగుతున్న పోలింగ్ #JubileeHillsByElection pic.twitter.com/0iO9ZtvFmP
— BIG TV Breaking News (@bigtvtelugu) November 11, 2025
Also Read: డిజిటల్ గోల్డ్‌పై ఇన్వెస్ట్‌మెంట్ సేఫేనా? సెబీ అలర్ట్!
జూబ్లీహిల్స్‌లో నాన్ లోకల్స్ ఉండటంపై సుదర్శన్ రెడ్డి సీరియస్..
అయితే జూబ్లీహిల్స్ లో నాన్ లోకల్స్ ఉండటంపై సీఈఓ సుదర్శన్ రెడ్డి సీరియస్ అయ్యారు. నియోజకవర్గంలోని స్థానికేతరులపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతానికి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది అని చెప్పారు. అలాగే ఇప్పటి వరకు నాన్ లోకల్స్ పై 3 FIR లు నమోదు చేశామని కూడా వెల్లడించారు.
జూబ్లీహిల్స్‌లో నాన్ లోకల్స్ ఉండటంపై సీఈవో సుదర్శన్ రెడ్డి సీరియస్
నియోజకవర్గంలోని స్థానికేతరులపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు
పొలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందన్న సీఈఓ
ఇప్పటి వరకు నాన్ లోకల్స్‌పై 3 FIR లు నమోదు చేశామని వెల్లడి pic.twitter.com/2VJl2zw6g2
— BIG TV Breaking News (@bigtvtelugu) November 11, 2025