BigTV English

Telangana: కొత్త సచివాలయంలో తొలిసారి.. ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ…

Telangana: కొత్త సచివాలయంలో తొలిసారి.. ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ…


Telangana: తెలంగాణ కొత్త సచివాలయంలో తొలిసారి కేబినెట్ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ప్రధానంగా పోడు భూముల పట్టాల పంపిణీతో పాటు, ముఖ్యంగా జూన్ 2 నుంచి తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీంతో 21 రోజులపాటు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. అమరవీరుల స్మృతి వనం రాష్ట్ర అవతరణ దినోత్సవల్లో ఏదో ఒక రోజు ప్రారంభించే అంశంపై తేదీని ఖరారు చేయనున్నారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీపై కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను గవర్నర్ తిరస్కరించడంతో వాటిపై కూడా ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఏడు పెండింగ్ బిల్లులపై సుప్రీంకోర్టుకెళ్ళింది తెలంగాణ ప్రభుత్వం. అందులో కొన్ని బిల్లులపై నిర్ణయం తీసుకున్న గవర్నర్.. మరికొన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలనకు తిప్పి పంపారు. అందులో ముఖ్యంగా పురపాలక నిబంధన చట్ట సాధన బిలు… ప్రైవేట్ యూనివర్సిటీలో చట్టం సవరణలో మార్పులు చేర్పులతో సమావేశాల్లో ఈ బిల్లులను పెట్టి గవర్నర్‌కు పంపే అవకాశం ఉంది. అంతేకాకుండా వైద్య విద్యలో HODల వయో పరిమితి బిల్‌ను గవర్నర్ తిరస్కరించి పంపారు. దీనిపై కేబినెట్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ బిల్లులకు సంబంధించి రెండు మూడు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలను కూడా నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దీనిపై కూడా కేబినేట్‌లో చర్చ జరిగే అవకాశం ఉంది.


రాజకీయపరమైన అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్నాటక ఫలితాలు తెలంగాణపై చూపే ప్రభావంపై చర్చించే ఛాన్స్ ఉంది. ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శంకుస్థాపనలు, పూర్తయిన పనులు ప్రారంభోత్సవాలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా వ్యూహ రచన తదితర అంశాలపై మంత్రులకు దిశా నిర్దేశం చేయనున్నట్టు సమాచారం.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×