E-Paper
Advertisement

Dasoju Sravan: ఆరు గ్యారంటీలపై మళ్లీ మోసం.. కాంగ్రెస్‌పై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఫైర్

Dasoju Sravan: ఆరు గ్యారంటీలపై మళ్లీ మోసం.. కాంగ్రెస్‌పై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఫైర్
Advertisement

Dasoju Sravan:  అబద్దాలు,మోసాల పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తుందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. తెలంగాణ భవన్ లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్‌ సర్కార్‌ మళ్లీ మోసం చేసిందని విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. కేసీఆర్ పైన పనిగట్టుకుని బురద చల్లారన్నారు. కేసీఆర్‌ రూ.8లక్షల కోట్ల అప్పు చేశారని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. రూ.3.47 లక్షల కోట్ల అప్పు తెచ్చానని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారని, మళ్లీ రూ.3.30 లక్షల కోట్లు అప్పు కట్టానని అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. ప్రభుత్వం కట్టిన అప్పు లక్షా 67 వేల కోట్ల అప్పు మాత్రమేనని స్పష్టం చేశారు.

Also Read: Shahid Afridi On Naqvi: లాట‌రీ తీసి PSL 2026 టైటిల్ ఇచ్చేయండి..ఇన్ని డ్రామాలు ఎందుకు రా

రేవంత్ రెడ్డి అబద్దాలు

Advertisement

కేసీఆర్‌ను బద్నాం చేసేందుకు అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి అబద్దాలు ఆడుతున్నారనిఆరోపించారు. గవర్నర్ ప్రసంగం అబద్ధం అని నేను మండలిలో మాట్లాడితే అభ్యంతరం తెలిపారని అన్నారు. అసెంబ్లీలో సీఎం అబద్దాలు మాట్లాడితే ఏం చేయాలో ప్రజలే నిర్ణయించాలని అన్నారు. బడ్జెట్‌తో చీట్ చేసే ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా అని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలపై కేటీఆర్ ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశ పెట్టనున్నారని,ఈ బిల్లుకు సభ్యులు మద్దతు ఇవ్వాలని కోరారు. బడ్జెట్‌లో 2026-27లో విద్యా శాఖకు నిధుల కేటాయింపులు తగ్గాయని,కేవలం 8 శాతం మాత్రమే నిధులు కేటాయించారని తెలిపారు. దీనిపై విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళితో పాటు సభ్యులు స్పందించాలని కోరారు. విద్యా శాఖను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు.

Also Read: Etela Rajender: పేదల భూములు గుంజుకుంటుంటే చూస్తూ ఊరుకోం.. ప్రభుత్వ‌పై ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×