Shahid Afridi On Naqvi: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament ) మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. మార్చి 26వ తేదీన ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహిస్తామని తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi ) సంచలన ప్రకటన చేశారు. ఆర్థిక పరిస్థితులు, చమురు కొరత ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే మొహ్సిన్ నఖ్వీ చేసిన ప్రకటన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రీది (Shahid Afridi ) కౌంటర్ ఇచ్చారు. ఇన్ని డ్రామాలు ఎందుకు ? ఒకేసారి లాటరీ పద్ధతిలో లైవ్ టెలికాస్ట్ ఆపేసి పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ విజేతను ప్రకటించండి అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు షాహిద్ ఆఫ్రీది. దీంతో షాహిద్ ఆఫ్రీది చేసిన వ్యాఖ్యలు దుమారం జరుగుతున్నాయి.
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ప్రేక్షకులు లేకుండానే నిర్వహిస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహ్సిన్ నక్వి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది (Shahid Afridi ) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రేక్షకులు లేకుండా టోర్నమెంట్ నిర్వహించడం వల్ల ఏం లాభం అని నిలదీశారు. ఈ విషయంలో షాహిద్ ఆఫ్రీది పాకిస్తాన్ ప్రజలకు సమాధానం ఇవ్వాలని ఫైర్ అయ్యారు.
జనాలు లేకుండా, టోర్నమెంట్ నిర్వహిస్తే పాకిస్తాన్ పరువు పోతుందని మండిపడ్డారు. దీని కంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో పాల్గొని ఎనిమిది జట్ల ఓనర్లను ఒకే వేదికకు పిలిపించండి.. ఆ తర్వాత లైవ్ కవరేజ్ ఆపేసి, లాటరీ పద్ధతిన విజేతను ప్రకటించండి అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ తర్వాత లాటరీ పద్ధతిలో గెలిచిన వాళ్లకు పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ టైటిల్ అందించాలని ఎద్దేవా చేశారు. అప్పుడైనా మీకు సిగ్గు వస్తుందని సీరియస్ అయ్యారు షాహిద్ ఆఫ్రీది.
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటును ప్రేక్షకులు లేకుండానే నిర్వహిస్తామని మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi ) ప్రకటన చేశారు. యుద్ధం నేపథ్యంలో ఇంధన ఖర్చులు విపరీతంగా అవుతాయని, ఇదంతా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై భారంగా పడుతుందని మొహ్సిన్ నఖ్వీ తెలిపారు. అందుకే ప్రేక్షకులు లేకుండానే టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. లాహోర్ అలాగే కరాచీ వేదికల్లో మాత్రమే ఈ టోర్నమెంట్ నిర్వహిస్తామని క్లారిటీ ఇచ్చారు. దీనివల్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పైన ఆర్థిక భారం పడబోదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
🚨 SHAHID AFRIDI COOKED MOHSIN NAQVI 🚨
"Mohsin Naqvi, just tell the public clearly that there will be no crowd, no live coverage. Then, call the owners of the eight teams, hold a lottery, and announce whoever’s name comes out as the winner of PSL 2026." pic.twitter.com/kSUTlq74jf
— Fan Account Richard Kettlebourogh (@RichKettle07) March 22, 2026