Big Stories

Thirumala : నేడే డిసెంబర్ కోటా విడుదల

Thirumala : శ్రీవారి భక్తుల సౌకర్యార్థం డిసెంబ‌రు నెల‌కు సంబంధించిన‌ రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఇవాళ నవంబర్ 11న ఆన్‌లైన్‌లో విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు టికెట్లను విడుదల చేసేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. వచ్చే నెలలో తిరుమల వెళ్లాలనుకునే భక్తులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ముందస్తుగా దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలని కోరారు.

డిసెంబర్‌ నెల మొత్తానికి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు అందుబాటులో ఉంచనున్నామని తెలిపారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో టికెట్లను బుక్‌ చేసుకోవాలని టీటీడీ సూచిస్తోంది. కరోనా పూర్తిగా తగ్గిపోవడంతో తిరుమలకి వచ్చే భక్తుల సంఖ్య బాగా పెరిగింది. తిరుమలలో కూడా పూర్తిగా నిబంధనలు ఎత్తివేయడంతో కొన్ని నెలలుగా భక్తులు పెద్ద ఎత్తున తిరుమలను సందర్శిస్తున్నారు. డిసెంబర్‌ నెలలో అధిక పెళ్లిళ్లు ఉన్నందున భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

Latest News