OTT Movie : కొన్ని ప్రేమ కథలు ఎప్పుడూ గొప్పగానే ఉంటాయి. లవ్ స్టోరీ అంటే లైలా, మజ్ను, పారూ, దేవదాస్ లే కాదు, అంతకు మించి హార్ట్ టచ్ చేసే కథలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రేమ కథ రియల్ లైఫ్ లో జరిగిందే. ఈ సినిమా రచయిత తన సోదరి ప్రేమ కథని ఒక నవల రూపంలో భద్రంగా దాచాడు. మనసును హత్తుకునే ఈ లవ్ స్టోరీని, ప్రేమికులు అస్సలు మిస్ కావద్దు. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
“ఎ వాక్ టు రిమెంబర్” (A Walk to Remember) అనే ఈ రొమాంటిక్ మూవీకి ఆడమ్ షాంక్మాన్ దర్శకత్వం వహించారు. ఇందులో షేన్ వెస్ట్, మాండీ మూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2002 జనవరి 25న విడుదలైంది. రచయిత నికోలస్ స్పార్క్స్ 1999లో రచించిన నవల ఆధారంగా రూపొందింది. ఈ నవల అతని దివంగత సోదరి డేనియల్ స్పార్క్స్ లూయిస్ జీవితం నుండి ప్రేరణ పొంది రాయబడింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో అందుబాటులో ఉంది.
అమెరికాలోని ఒక చిన్న పట్టణంలో లాండన్ ఒక హైస్కూల్ లో చదువుతుంటాడు. అతను కొంచె అల్లరి పిల్లాడు. రూల్స్ బ్రేక్ చేస్తుంటాడు. అతని అల్లరి ఒక రోజు శృతి మించడంతో లాండన్ కు స్కూల్ పనిష్‌మెంట్ ఇస్తుంది. స్కూల్ మొత్తం క్లీనింగ్ చేయమని చెప్తుంది. అక్కడే అతను జామీ అనే అమ్మాయిని కలుస్తాడు. జామీ ఒక పాస్టర్ కూతురు. ఎప్పుడూ బైబిల్ చదువుతుంటుంది. ఒంటరిగా ఎక్కువ సమయం గడుపుతుంటుంది. లాండన్ మొదట ఆమెను కూడా టీజ్ చేస్తాడు. కొంత సమయంలోనే ఫ్రెండ్స్ అవుతారు. ఆ తరువాత లాండన్ జామీతో ఎక్కువ టైమ్ గడుపుతాడు. ఆమె అతనికి టెలిస్కోప్ చూపిస్తుంది, స్టార్స్ గురించి చెబుతుంది. ఆమెకు తోకచుక్కను చూడడం డ్రీంగా ఉంటుంది.
Read Also : ఒకే మనిషిని పట్టి పీడించే 4 దెయ్యాలు… దెబ్బకు మనోడి లైఫ్ సెట్టు… ఇలాంటి హర్రర్ మూవీని అస్సలు చూసుండరు భయ్యా
ఇప్పుడు లాండన్ ఆమెను ఇష్టపడతాడు. ఆమెను డేట్‌కు ఆహ్వానిస్తాడు. లాండన్ తన పాత ఫ్రెండ్స్‌ను వదిలేస్తాడు. జామీ వల్ల అతను పూర్తిగా మారి, మంచి బాయ్ అవుతాడు. ఇలా వుంటే ఒక రోజు జామీ లాండన్‌కు ఒక సీక్రెట్ చెబుతుంది. నాకు లూకేమియా ఉంది. ఇంక ఎక్కువ కాలం నేను బతకనని అంటుంది. లాండన్ ఒక్క సారిగా షాక్ అవుతాడు. కానీ ఆమెను వదలడు. లాండన్ ఆమె కోరికలను అన్నీ నెరవేరుస్తాడు. టెలిస్కోప్‌తో తోక చుక్కను కూడా చూపిస్తాడు. ఆమెను పెళ్లి కూడా చేసుకుంటాడు. చివరికి జామీ చనిపోతుంది. ఇక లాండన్ డాక్టర్ అవుతాడు. చివరి సీన్‌లో లాండన్ సముద్రం దగ్గర నిలబడి: “ఆమె నా మిరాకిల్. ఆమె నాకు ప్రేమ నేర్పింది. ఆమెను నేను ఎప్పటికీ మరచిపోను.” అని లాండన్ మనసులో అనుకుంటాడు.