Big Stories

Dhanurmasam Vratham : ధనుర్మాస వ్రతము చేస్తే కలిగే ఫలితాలు ఇవే

Dhanurmasam Vratham : ఈ ఏడాది ధనుర్మాసము మార్గశిర మాసములో సంభవించడం విశేషం. ఆరోజు చేసే వ్రతం చాలా ప్రత్యేకమైంది. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం కాల విభజన సూర్యచంద్రుల వల్లే జరుగుతుంది. చంద్రుడు పౌర్ణమిరోజు ఏ నక్షత్రమునకు దగ్గరగా ఉంటాడో.. ఆ నక్షత్రము ఆధారంగా మాసములు ఏర్పడుతాయి. సూర్య సిద్ధాంతం ప్రకారం సూర్యుడు ఏ రాశినందు సంచరించునో ఆ మాసమునకు ఆ రకమైన పేరు ఏర్పడింది. డిసెంబర్ 16న సూర్యుడు ధనూరాశిలో ప్రవేశిస్తున్నాడు. అందుకే డిసెంబర్ 16వ తేదీనుంచి జనవరి 15 వరకు మధ్య ఉన్నటువంటి మాసమును ధనుర్మాసమంటారు.

- Advertisement -

దక్షిణాయానంలో ఆఖరిది ధనుర్మాసము. మార్గశిర మాసంలో ధనుర్మాసము, ధనుర్మాస వ్రతము చాలా ప్రత్యేకమైనది. ధనుర్మాసంలో తెల్లవారజామున లేచి స్నానం చేసి విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించుకని పూజ చేస్తే కొన్ని వేల రెట్ల పుణ్య ఫలం లభిస్తుంది. ధనుర్మాసములో ఇంటిని శుభ్రం చేసుకుని, ఉదయం, సాయంత్రం కూడా లక్ష్మీదేవి వద్ద ఆవునేతితో దీపారాధన చేస్తే శ్రీలక్ష్మీ కటాక్షం ప్రాపిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

- Advertisement -

ఈ మాసంలో ఉదయం పూట విష్ణుమూర్తిని పూజించడం, సాయంత్రం వేళలో లక్ష్మీదేవిని పూజించడం అత్యంత పవిత్రమైనదిగా పురాణాలు ఘోషిస్తున్నాయి. ధనుర్మాసంలో ఏ ఒక్క రోజు మహావిష్ణువును పూజించినా.. కొన్ని వేల సంవత్సరాలు మహా విష్ణువును పూజించిన ఫలితము వస్తుందని పురాణాలు చెప్తున్నాయి.

విష్ణు భగవాడుని పంచామృతాలతో అభిషేకించి.. తులసి నీళ్లను శంఖములోని నీళ్లతో స్వామిని అభిషేకించడం వంటివి చేయాలి. విష్ణుమూర్తిని పూజించే మాసము కనుకనే ఈ మాసంలో శుభకార్యములు నిషేధించారు.. ధనుర్మాసం సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈనెల 16నుంచి వచ్చే నెల 15వరకు ధనుర్మాస ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. నెల రోజులపాటు ఉదయం 4.30కి తిరుప్పావై కార్యక్రమం నిర్వహిస్తారు. జనవరి 14న గోదా కళ్యాణం నిర్వహిస్తారు

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News