BigTV English

Computer Chips Efficient:కంప్యూటర్ చిప్స్‌ను మెరుగుపరిచే డైమండ్లు..

Computer Chips Efficient:కంప్యూటర్ చిప్స్‌ను మెరుగుపరిచే డైమండ్లు..

Computer Chips Efficient:రోజూవారీ జీవితాల్లో ఉపయోగపడే ప్రతీ చిన్న వస్తువును కృత్రిమంగా తయారు చేయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. అందులో చాలావరకు పరిశోధనలు సక్సెస్ అయ్యి మార్కెట్లోకి ఎంటర్ అయ్యాయి కూడా. అదే విధంగా కృత్రిమంగా డైమండ్ల తయారీ కోసం కూడా శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో డైమండ్లు కేవలం నగల వరకే కాదు.. ఇంకా చాలా విధాలుగా ఉపయోపడతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.


ల్యాబ్ గ్రోన్ డైమండ్ల (ఎల్జీడీ) పరిశోధనల కోసం కేంద్ర ప్రభుత్వం కూడా శాస్త్రవేత్తలకు సహకరించడానికి సిద్ధపడింది. వాటికోసం అయ్యే ఖర్చును బడ్జెట్‌లో కూడా కేటాయించి వారికి ప్రోత్సాహాన్ని అందించింది. దీంతో శాస్త్రవేత్తలు డైమండ్ల పరిశోధనలను వేగవంతం చేశారు. 2023లో ఎల్జీడీ ద్వారా 5 బిలియన్ డాలర్ల ఆదాయం పొందాలని, 2025లోపు దీనిని 15 బిలియన్ డాలర్లకు పెంచాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. 2020లో ఎల్జీడీ నుండి వచ్చిన ఆదాయం కేవలం 1 బిలియన్ డాలర్లు మాత్రమే.

డైమండ్లు అనగానే అందరికీ సాధారణంగా గుర్తొచ్చేవి నగలు. డైమండ్‌తో చేసిన నగలంటే చాలామంది ఇష్టపడతారు. అయితే కేవలం జెవలరీ ఇండస్ట్రీలోనే కాకుండా డైమండ్లు మరికొన్ని విభాగాల్లో కూడా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఎల్జీడీని ఎన్నో విభాగాల్లో ఉపయోగిస్తారు. కంప్యూటర్ చిప్స్, శాటిలైట్లు, 5జీ నెట్‌వర్క్.. ఇలాంటి వాటిలో ఎల్జీడీని వినియోగిస్తారు. సిలికాన్‌తో తయారు చేసిన చిప్స్ కంటే ఎల్జీడీతో తయారు చేసిన చిప్స్.. ఎక్కువ వేగంతో, తక్కువ కరెంటుతో పనిచేస్తాయి.


ఇప్పటికే ఎల్జీడీని డిఫెన్స్, ఆప్టిక్స్, థర్మల్, హెల్త్ ఇండస్ట్రీలలో ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా భారత్ నుండి ఈ ఎల్జీడీల ఎగుమతి భారీ స్థాయిలో పెరిగిందని ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేస్తుంది. 637.97 మిలియన్ డాలర్ల విలువ చేసే ఎల్జీడీని 2021లో ఎగుమతి చేసింది భారత్. ఇక 2022 వచ్చేసరికి ఎగుమతి విలువ 1,348.24 మిలియన్ డాలర్లకు పెరిగింది. పర్యావరణానికి నష్టం కలిగించకుండా తయారు చేసే ఈ డైమండ్లకు.. మార్కెట్లో బాగా డిమాండ్ ఉందని నిపుణులు చెప్తున్నారు.

అందుకే ఎల్జీడీల తయారీకి ప్రత్యేకంగా ఒక ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించుకుంది. వచ్చే అయిదేళ్లలో రూ.242.96 కోట్ల ఖర్చుతో ఇండియ సెంటర్ ఫర్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ (ఇన్‌సెంట్ ఎల్జీడీ) పేరుతో ఐఐటీ ఎమ్‌లోనే ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా భారత్‌లో ఎల్జీడీ పరిశోధనల్లో భాగమైన పరిశోధకులను, ఇన్‌స్టిట్యూట్స్‌ను సపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అంతే కాకుండా మంచి క్వాలిటీ డైమండ్ల తయారీకి ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Lithium Air Battery:ఒక్కసారి ఛార్జింగ్ పెడితే చాలు.. వెయ్యి మైళ్లు ప్రయాణించవచ్చు..!

Related Diseases:గోధుమల వల్ల ఏర్పడే వ్యాధులపై పరిశోధనలు..

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×