BigTV English

Nayanatara : డైరెక్టర్ తో నయనతార గొడవ.. ఇంకా మారలేదా తల్లి..?

Nayanatara : డైరెక్టర్ తో నయనతార గొడవ.. ఇంకా మారలేదా తల్లి..?

Nayanatara : తమిళ స్టార్ హీరోయిన్ లేడీ బాస్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈమె ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలోనే ఈమె పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు తల్లయింది. ప్రస్తుతం సినిమాలల్లో నటిస్తూ ఉంది. అయితే నయనతార పెళ్లయిన తర్వాత కోరి మరి వివాదాలు కొని తెచ్చుకుంది. ఇక సినిమా సెట్ లో కూడా డైరెక్టర్లతో తోటి హీరోలతో గొడవ పడడం నయనతార కి కొత్త ఏమీ కాదు.. గతంలో చాలామంది ఆమెపై కంప్లైంట్స్ కూడా ఇచ్చారు. అయినా ఆమె ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో తల దురుస్తూ నిత్యం వార్తల్లో హైలైట్ అవుతూ ఉంటుంది. మరో వివాదం ఆమె కు షాక్ ఇచ్చింది. ఆ పని చేస్తున్న సినిమా డైరెక్టర్ తో గొడవ పడటంతో ఆ సినిమా బ్రేక్ పడింది ఇంతకీ ఆ సినిమా ఏంటి అసలు నయనతారకి డైరెక్టర్ కి మధ్య గొడవ ఏంటి? ఇప్పుడు మనం తెలుసుకుందాం.


విమర్శలకు కేరాఫ్ గా నయనతార.. 

స్టార్ హీరోయిన్ నయనతార ఈమధ్య సినిమాలకన్నా వివాదాలతో ఎక్కువగా ఫేమస్ అవుతుంది. రీసెంట్ గానే ఆమెపై నెటిజన్లు మండిపడ్డారు. మూకుత్తి అమ్మన్ 2 సినిమా పూజా కార్యక్రమాల్లో తోటి నటి మీనాను అవమానపరిచారు అంటూ ఆమెను ట్రోల్‌ చేశారు.. అది మరొక ముందే ఇప్పుడు మరో వివాదంలో నయనతార ఇరుక్కుంది. నయనతారపై మరో పుకారు నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. మూకుత్తి అమ్మన్ 2 సినిమా సెట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌తో నయనతార గొడవపడిందట. ఈ విషయంపై డైరెక్టర్ సుందర్ తో గొడవలు తారస్థాయికి చేరాయి అని తెలుస్తుంది. అసలు మ్యాటరేంటంటే..


డైరెక్టర్ తో గొడవేంటి..? 

నయనతార, డైరెక్టర్ సుందర్ కాంబోలో మూకుతి అమ్మన్ 2 అనే మూవీ తెరకేక్కుతున్న సంగతి తెలిసిందే.. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. తాజాగా కాస్ట్యూమ్ విషయంలో నయనతార , ఒక అసిస్టెంట్ డైరెక్టర్ మధ్య చిన్నపాటి వివాదం జరిగినట్లు సమాచారం. అది నచ్చక డైరెక్టర్ పై సీరియస్ అయ్యిందని కొలీవుడ్ ఇండస్ట్రీలో కోడై కూస్తుంది. ఈ గొడవ కాస్త ముదరడంతో డైరెక్టర్ సినిమా షూటింగ్ ను పూర్తిగా ఆపేసారని తెలుస్తుంది. అంతేకాధు ఆమె ప్లేసులో కొత్త హీరోయిన్ ను దించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. నిర్మాత ఇషారి కె. గణేష్ జోక్యం చేసుకుని నయనతారతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించారట. ప్రస్తుతం చెన్నైలోని ఓ దేవాలయంలో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతుంది..

మూకుతి అమ్మన్ 2 మూవీ విషయానికొస్తే.. ఈ మూవీ గతంలో వచ్చిన మూకుతి అమ్మన్ మూవీకి ఇది సీక్వెల్ గా వస్తుంది. మూకుత్తి అమ్మన్’ చిత్రానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించగా.. సీక్వెల్‌ని సుందర్‌.సి తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో నయనతారతో పాటు ఇనియా, రెజీనా కసెండ్రా, మైనా నందిని, దునియా విజయ్, సింగం పులి, యోగిబాబు వంటి నటులు ఇందులో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు సమాచారం.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×