Skin Allergy: స్కిన్ అలెర్జీ అనేది ఒక సాధారణ సమస్య. ప్రస్తుతం చాలా మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. స్కిన్ అలెర్జీ వివిధ కారణాల వల్ల వస్తుంది. అయితే.. ఈ సమస్య నుండి బయట పడటానికి ముందుగా మనం కారణాలను అర్థం చేసుకోవాలి. తర్వాత మన చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం..సరైన చర్మలు తీసుకోవడం ద్వారా స్కిన్ అలెర్జీ నుండి తక్కువ సమయంలోనే బయట పడవచ్చు.
చర్మంపై అలెర్జీ:
సబ్బులు, షాంపూలు, డిటర్జెంట్లు, పెర్ఫ్యూమ్‌ల వంటి అనేక రసాయనాలతో తయరు చేసిన ప్రొడక్ట్స్ మన చర్మ సున్నితత్వాన్ని పెంచుతాయి. ఈ రసాయనాలు అలెర్జీలకు కారణమవుతాయి. అంతే కాకుండా చర్పైమం దురద, మంట లేదా ఎరుపుదనాన్ని కలిగిస్తాయి.
కాలుష్యం:
వాయు కాలుష్యం, దుమ్ము, పొగతో నిండిన వాతావరణం కూడా చర్మ అలెర్జీలకు కారణాలు. చర్మంపై మురికి పేరుకుపోవడం వల్ల ఇది చర్మ అలెర్జీ సమస్యను పెంచుతుంది.
జన్యుపరమైన కారణాలు:
కొంతమందిలో చర్మ అలెర్జీలకు జన్యుపరమైన కారణాలు కూడా ఉంటాయి. కుటుంబంలో ఎవరికైనా చర్మ సమస్యలు ఉంటే.. వారి పిల్లలకు కూడా అలెర్జీలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా:
బ్యాక్టీరియా, వైరస్‌లు, శిలీంధ్రాల వల్ల స్కిన్ అలెర్జీ వచ్చే ప్రమాదం ఉంటుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులపై వీటి ప్రభావాలు ఎక్కువగా కనిపిస్తాయి.
హార్మోన్ల మార్పులు:
శరీరంలోని హార్మోన్ల మార్పులు చర్మాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. గర్భం, ఋతుస్రావం లేదా ఒత్తిడి హార్మోన్ల మార్పులకు కారణమవుతాయి. ఇది అలెర్జీలను ప్రేరేపిస్తుంది.
సూర్య కిరణాలు:
సూర్య కిరణాలు లేదా UV కిరణాలు కూడా చర్మానికి హానికరం. ఇవి అలెర్జీలకు కారణమవుతాయి. ముఖ్యంగా చర్మం ఇప్పటికే సున్నితంగా ఉన్నవారిలో ఈ ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.
జాగ్రత్తలు:
చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీ ముఖం, శరీరాన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. ముఖ్యంగా రోజంతా దుమ్ము, కాలుష్యం నుండి మీ చర్మాన్ని రక్షించుకోవడానికి ప్రతి 3-4 గంటలకు ఒకసారి మీ ముఖాన్ని కడుక్కోండి.
వేసవిలో సన్‌స్క్రీన్ వాడండి:
సున్నితమైన చర్మం ఉన్న వారు ఎటువంటి రసాయనాలు ఉపయోగించని సబ్బులు, షాంపూలు, క్రీములను వాడటం మంచిది. హైపోఅలెర్జెనిక్ ఉత్పత్తులను ఉపయోగించడం బెటర్.
సన్‌స్క్రీన్:
ప్రతి సీజన్‌లో సన్‌స్క్రీన్‌ను ఉపయోగించండి. ముఖ్యంగా వేసవిలో UV కిరణాల నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి ఇది ఒక ముఖ్యమైన అంశం.
Also Read: ఇంట్లోనే ఇలా నేచురల్ హెయిర్ కలర్స్ తయారు చేసుకుని వాడితే.. తెల్ల జుట్టు మాయం
సమతుల్య ఆహారం:
సరైన, పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం చర్మానికి చాలా ప్రయోజనాలను అందిస్తుంది. ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, ప్రోటీన్లు , ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారం చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కాకుండా అలెర్జీల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
త్రాగు నీరు:
శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం. తగినంత నీరు త్రాగడం వల్ల చర్మానికి తేమ లభిస్తుంది. ఇది మంచి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయ పడుతుంది. నీరు లేకపోవడం వల్ల చర్మం పొడిబారడం జరుగుతుంది. ఫలితంగా అలెర్జీ సమస్యలు వస్తాయి.